ETV Bharat / sitara

వారి ప్రతిభ చూస్తే భయమేస్తోంది: అమితాబ్

ప్రస్తుతం బాలీవుడ్​ యువతరాన్ని చూస్తుంటే తనకెంతో భయమేస్తోందని అంటున్నారు బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​. నటనలోనే కాకుండా చిత్రనిర్మాణంలోని ప్రతి విభాగంలోనూ ప్రతిభావంతులైన వారున్నారని అభిప్రాయపడ్డారు. వారితో కలిసి జీవించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అమితాబ్​ తెలిపారు.

Feel small in front of new breed, says Amitabh Bachchan
'ఆ కళాకారులున్న యుగంలో జీవించడం నా అదృష్టం'
author img

By

Published : Nov 10, 2020, 7:42 PM IST

బాలీవుడ్​లోని యువ కళాకారులను ప్రశంసించారు బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​. ఇలాంటి ప్రతిభావంతులున్న యుగంలో తాను జీవించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నటనలోనే కాకుండా చిత్రనిర్మాణంలోని అనేక విభాగాల్లోనూ ప్రతిభావంతులున్నారని అభిప్రాయపడ్డారు.

"ఈ యుగంలో జీవించడం చాలా కష్టం. అనేక మంది ప్రతిభావంతులు తెరకు పరిచయమవుతున్నారు. థియేటర్లలోనే కాకుండా బుల్లితెరపై కూడా వారి తెలివితేటలు చూస్తుంటే ఆశ్చర్యపోతారు. రచన, చిత్రీకరణ, కెమెరా పనితనంలో చూస్తే దేశంలో మునుపెన్నడూ చూడని ప్రాంతాలను ప్రేక్షకులకు చూపించడం సహా.. సహజ నటనతో అలరిస్తున్నారు. ఈ యువతరాన్ని చూసి నేను భయపడుతున్నా. అత్యద్భుతమైన నటనతో వారిలోని ప్రతిభను మరింతగా బయటపెడుతున్నారు. నన్ను నేను చూసుకుంటే చాలా నిస్సహాయంగా, చిన్నగా ఉన్నా. వారు ఈ ఏడాదే కాకుండా భవిష్యత్​ కోసం మరిన్ని గొప్ప చిత్రాలను నిర్మిస్తున్నారు".

- అమితాబ్​ బచ్చన్​, బాలీవుడ్​ నటుడు

చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు గడిచినా తాను నేర్చుకోవాల్సింది మరెంతో ఉందని బిగ్​బీ అప్పుడప్పుడు చెబుతుంటారు. ఈ నటుడు చివరిసారిగా 'గులాబో సితాబో' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన సినిమాల్లో సరాసరి ఓటీటీలో విడుదలైన చిత్రం ఇదే. అమితాబ్​.. ప్రస్తుతం 'ఝుండ్'​, 'బ్రహ్మాస్త్ర', 'చెహ్రే' వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.