ప్రపంచ మాజీ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్(Sushmita Sen) సోషల్‌మీడియా ద్వారా తరుచుగా తన అభిమానులతో ముచ్చటిస్తుంది. శుక్రవారం ఆమె ఇన్‌స్టాలో లైవ్ నిర్వహించగా.. ఓ అభిమాని సుస్మితాకు పెళ్లి చేసుకుంటారా అని ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో పక్కన ఉన్న ఆమె ప్రియుడు రోహ్మన్(Rohman Shawl) స్పందించాడు.
ఓ వెబినార్‌లో పాల్గొన్న తర్వాత సుస్మితా సేన్ శుక్రవారం ఇన్‌స్టా లైవ్ నిర్వహించింది. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అయితే అంతలోనే ఓ అభిమాని తనను పెళ్లి చేసుకుంటావా? అని అడిగిన ప్రశ్నకు.. పక్కనే ఉన్న సుస్మితా ప్రియుడు రోహ్మన్ 'లేదు' అని వెంటనే సమాధానమిచ్చాడు.
ఇదే లైవ్‌లో సుస్మితా సేన్ కూడా అసూయ పడే పరిస్థితి ఎదురైంది. ఆమె ప్రియుడు రోహ్మన్ ఉద్దేశించి ఓ నెటిజన్.. 'లవ్ యూ రోహ్మన్' అంటూ కామెంట్ చేయగా, 'థ్యాంక్యూ, కనీసం ఒక్కరైనా చెప్పారు నాకు!' అని రోహ్మన్ అన్నాడు. దీనిపై సుస్మిత సరదాగా స్పందించింది. రోహ్మన్ను ఉద్దేశిస్తూ.. 'నువ్వు నాకు తర్వాత కనపించు' అని చెప్పింది.
సుస్మితా సేన్.. ప్రస్తుతం 'ఆర్య 2'(Aarya 2 Web series) వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌నూ పంచుకుంది. 'ఆర్య 2' చివరి షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపింది. దీంతో పాటు రాబోయే సీజన్లో సంగీతం ప్రధానంగా సాగనుందని వెల్లడించింది.
ఇదీ చూడండి.. Ariana: లేడి కళ్ల లేజరే నువ్వా.. పారడైస్ ఫ్లేవరే నువ్వా!