ప్రముఖ నటి ఊర్మిళా మాతోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అంతర్గత కలహాలు, స్వార్థపూరిత రాజకీయాల మధ్య ఉండలేనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారామె.
హిందీ, దక్షిణ భాషల్లో అనేక చిత్రాలు చేసిన ఊర్మిళ.. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ముంబయి నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ పార్టీలో రాజీనామల పర్వం కొనసాగింది. ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు స్వచ్ఛందంగా పార్టీ పదవుల నుంచి తప్పుకున్నారు. మరికొందరు పార్టీకే వీడ్కోలు పలికారు.
ఇదీ చూడండి:- బోధ్‌గయ పేలుడు కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్