ETV Bharat / sitara

'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్​ వాయిదా! - ఫ్యామిలీ మ్యాన్ 2

ఎంతగానో ప్రజాదరణ పొందిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్​సిరీస్ సీజన్​ 2 విడుదల తేదీ వాయిదాపడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్​లో ఇటీవలే విడుదలైన 'తాండవ్', 'మీర్జాపుర్' సిరీస్​లపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో 'ఫ్యామిలీ మ్యాన్'​ను కొంతకాలం తర్వాత రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.

Family Man series 2 post poned
'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్​ వాయిదా!
author img

By

Published : Feb 1, 2021, 12:40 PM IST

ప్రముఖ వెబ్‌ సిరీస్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్‌ 2 వాయిదా పడుతోందా? అంటే అవుననే వినిపిస్తుంది సినీ వర్గాల్లో. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ మొదటి భాగం ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. శ్రీకాంత్‌ తివారీగా మనోజ్‌ నటన విశేషంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌ అందించిన విజయోత్సాహంతో 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్‌ 2ను తెరకెక్కించారు దర్శకద్వయం రాజ్‌, డీకే. అదనపు ఆకర్షణగా కథానాయిక సమంత నటించింది.

అయితే ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు గతంలో ప్రకటించింది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో. 'తాండవ్‌', 'మీర్జాపూర్‌' సిరీస్‌ల ప్రసార హక్కులూ ఈ సంస్థే దక్కించుకుంది. అయితే ఈ రెండింటిపై ఆయా ప్రాంతాల నుంచి ఆరోపణలు ఎదురవడం వల్ల 'ఫ్యామిలీ మ్యాన్'ను మరికొన్ని రోజుల వాయిదా అనంతరం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది అమెజాన్‌.

ఇటీవలే విడుదలైన 'తాండవ్‌'పై ఓ మతానికి సంబంధించి, 'మీర్జాపూర్‌ 2' హింసని ప్రోత్సాహించేలా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇటువంటి వాటికి తావులేని ఎంతో ప్రజాదరణ పొందిన 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్‌ను తీసుకురావడం మంచిది కాదనే నిర్ణయంలో ఉన్నారట దర్శకనిర్మాతలు. మరికొన్ని రోజుల్లో కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.