ETV Bharat / sitara

Fahad fazil movies: ఫహాద్ సినిమాకు అంతర్జాతీయ అవార్డు - జోజి చిత్రం విడుదల

విభిన్న చిత్రాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్న ఫహాద్ ఫాజిల్.. 'జోజి'(Fahadh Faasil Joji) చిత్రానికి అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Fahadh Faasil
ఫహద్ ఫాజిల్
author img

By

Published : Sep 24, 2021, 9:10 AM IST

Updated : Sep 24, 2021, 9:29 AM IST

మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ నటించిన 'జోజి' చిత్రానికి స్వీడిష్​ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని తన ఫేస్​బుక్​లో తెలిపారు ఫహద్. "స్వీడన్​ నుంచి గుడ్​న్యూస్! బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్​ అవార్డు, 2021లో జోజి సినిమాకు వచ్చింది" అని పేర్కొన్నారు. ఈ సినిమా షేక్​స్పియర్ 'మెక్​బెత్' నవల ఆధారంగా తెరకెక్కింది. 'జోజి'(Joji Movie Awards) సినిమా ఏప్రిల్ 7న అమెజాన్ ప్రైమ్​లో విడుదలైంది. ఈ చిత్రానికి దిలీశ్ పోతన్ దర్శకత్వం వహించారు.

.
.

దర్శకుడి కుమారుడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన ఫహాద్​​ ఫాజిల్.. కెరీర్ ఆరంభంలో నటన విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి 'సూపర్‌స్టార్‌' అనిపించుకున్నారు. దక్షిణాదిలో చేస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఫహాద్.. అల్లు అర్జున్ 'పుష్ప'లో విలన్​గా నటిస్తున్నారు.

ఇదీ చదవండి: fahadh faasil birthday: ఛీ కొట్టిన వాళ్లే శెభాష్ అనేలా!

Last Updated : Sep 24, 2021, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.