దేశ రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనల గురించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మళ్లీ మాట్లాడింది. రైతులను టెర్రరిస్టులని అన్నందుకు ప్రతిరోజు తనపై కేసులు నమోదవడం సహా ఇంటికి సమన్లు వస్తున్నాయని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో దాదాపు రూ.12-15 కోట్ల విలువైన తన బ్రాండ్లును కోల్పోయినట్లు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులకు అమెరికన్ పాప్ సింగర్ రిహన్న ఇటీవల మద్దతు తెలిపింది. ఈమెతో పాటు పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు. ఈ విషయమై స్పందించిన కంగన రిహన్నపై మండిపడింది. వారు రైతులు కాదు ఉగ్రవాదులని చెబుతూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
![kangana ranaut farmers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9159074-946-9159074-1602582025125_2901newsroom_1611906858_473.jpg)