ETV Bharat / sitara

ట్రెండ్ మారుతోంది.. మహిళా దర్శకులకు మంచిరోజులు! - నందినీ రెడ్డి డైరెక్టర్

తెలుగు చిత్రసీమలో సత్తాచాటుతున్నారు లేడీ దర్శకులు. ఇటీవలే విడుదలైన 'పెళ్లిసందD'(Pelli SandaD Director), 'వరుడు కావలెను'(Varudu Kaavalenu Director) చిత్రాలకు దర్శకత్వం వహించింది కొత్త లేడీ డైరెక్టర్లే కావడం విశేషం. ఈ నేపథ్యంలో.. ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి పేరు సంపాదించిన పలువురు మహిళా దర్శకుల గురించి తెలుసుకుందాం..

directors
డైరెక్టర్లు
author img

By

Published : Nov 3, 2021, 5:32 PM IST

తెలుగు చిత్రసీమ ప్రముఖ దర్శక దిగ్గజాలకు పెట్టింది పేరు. అయితే.. ఈ చిత్రసీమలో మహిళా దర్శకులు ఎంత మంది అంటే మాత్రం వెళ్లమీద లెక్కపెట్టి చెప్పే పరిస్థితి. పదేళ్లకోసారి ఓ లేడీ డైరెక్టర్ పేరు వినిపించేది. కానీ, ఈసారి ట్రెండ్ మారింది. ఇటీవలి కాలంలో విడుదలైన 'వరుడు కావలెను', 'పెళ్లిసందD', 'ఆకాశం నీ హద్దురా', 'ఓ బేబీ' వంటి చిత్రాలను తెరకెక్కించి ఇండస్ట్రీలో సత్తాచాటుతున్నారు లేడీ డైరెక్టర్లు. ఈ నేపథ్యంలో టాలీవుడ్​లో వారు వేసిన తొలి అడుగుతోనే సత్తా చాటిన మేటి లేడీ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం..

1. లక్ష్మీ సౌజన్య

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన 'వరుడు కావలెను'(Varudu Kaavalenu Director) చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది లక్ష్మీ సౌజన్య. ఈమె పుట్టింది కర్నూల్ జిల్లా వెంకటాపురం గ్రామంలో అయినప్పటికీ పెరిగిందంతా గుంటూరు జిల్లా నరసరావుపేటలోనే. సినిమాలపై ఉన్న ఆసక్తితో 18 ఏళ్లకే హైదరాబాద్ వచ్చింది సౌజన్య. ఆరంభంలో డైరెక్టర్​ తేజ వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేసే అవకాశం దక్కించుకుంది.

శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, క్రిష్ ఇలా చాలా మంది ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేసింది లక్ష్మీ సౌజన్య(Lakshmi Sowjanya Director Movies List). 2013లో విడుదలైన 'అలజడి' చిత్రానికి నిర్మాతగానూ పనిచేసింది. ఆమె దర్శకత్వం వహించిన 'వరుడు కావలెను' చిత్రం అక్టోబర్ 29న విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది.

lakshmi sowjanya
లక్ష్మీ సౌజన్య

2. గౌరి రోణంకి

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో 'పెళ్లిసందD'(Pelli Sandadi Director) చిత్రాన్ని రూపొందించారు. కథానాయకుడు శ్రీకాంత్ తనయుడు రోషన్, యువనటి శ్రీలీల జంటగా నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించి తెలుగు చిత్రసీమలో దర్శకురాలిగా అడుగుపెట్టింది గౌరి రోణంకి(Gowri Ronanki Movies). రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తొలి చిత్రాన్ని రూపొందించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు రోణంకి ఓ సందర్భంలో తెలిపింది. ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 15న విడుదలైన 'పెళ్లిసందD' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.

gauri ronanki
రాఘవేంద్రరావు, నాగార్జునతో గౌరి రోణంకి

3. సుధా కొంగర

'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది దర్శకురాలు సుధా కొంగర(Sudha Kongara Movies). ఈమె ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో జన్మించింది. తమిళనాడులోని చెన్నైలో పెరిగింది. ఈ కారణంగా తమిళ, తెలుగు చిత్రసీమల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2017లో విడుదలై హిట్​గా నిలిచిన స్పోర్ట్స్​ డ్రామా 'గురు' సినిమాకు దర్శకురాలు కూడా ఈమెనే(Director Sudha Kongara). ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్​, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే.. ముందుగా ఈ చిత్రాన్ని తమిళంలో 'ఇరుద్ది సుత్రు', హిందీలో 'సాలా కదూస్' పేరుతో తీసింది సుధా.

sudha kongara
సుధా కొంగర

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దగ్గర ఏడేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేసింది సుధా కొంగర. 2008లో కృష్ణ భగవాన్ కథానాయకుడుగా 'ఆంధ్రా అందగాడు' సినిమా తీసి టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. కానీ, ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. కానీ, తర్వాత తీసిన చిత్రాలతో మంచి దర్శకురాలిగా పేరు నిలబెట్టుకుంది సుధా.

4. నందినీ రెడ్డి

తెలుగు దర్శకుల్లో నందినీ రెడ్డిది(Nandini Reddy Movies) పరిచయం అక్కర్లేని పేరు. 2011లో 'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్​లో దర్శకురాలిగా తొలి అడుగులు వేసింది. తర్వాత 'కళ్యాణ వైభోగమే', 'ఓ బేబి' వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి సత్తా చాటింది. హైదరాబాద్​లో పుట్టి పెరిగిన ఈమె దర్శకురాలిగా మంచి పేరు సంపాదించింది.

nandini reddy
నందినీ రెడ్డి

ప్రస్తుతం నందిని(Nandini Reddy Director) 'అన్నీ మంచి శకునములే' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది.

గతంలో..

టాలీవుడ్​లో గతంలో డైరెక్టర్లుగా రాణించిన వారిలో భానుమతి, విజయనిర్మల, బి.జయ ఉన్నారు. 'దృశ్యం' సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీ ప్రియ కూడా దర్శకురాలిగా ఇటీవలి కాలంలో మంచి పేరు సంపాదించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.