ETV Bharat / sitara

సినిమాకే కొత్త దృశ్యాన్ని చూపించిన ఆర్జీవీ - eenadu rgv full story

తెలుగు సిని పరిశ్రమలో అతని పేరు తెలియని వారు లేరు. తన మొదటి సినిమాతో ఇండస్ట్రీకి తన సత్తా ఏమిటో చూపించిన వ్యక్తి. హరర్‌ మూవీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచి, ఎన్నో వైవిధ్య భరితమైన చిత్రాలను అందించాడు. శ్రీదేవి తన అందాల దేవతగా కొలిచి తనతోనే ఎన్నో హిట్‌ సినిమాలను అందించాడు. కేవలం ఐదు రోజుల్లోనే సినిమాను చిత్రీకరించి సినీ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేశాడు. అతనే అందరూ ముద్దుగా పిలిచుకునే ఆర్జీవీ..అలియాస్‌ రామ్‌ గోపాల్‌ వర్మ

e tv bharat rgv spl story
సినిమాకే కొత్త దృశ్యాన్ని చూపించిన ఆర్జీవీ
author img

By

Published : Apr 7, 2020, 5:35 AM IST

ఆయన పేరు తలచుకోగానే ఓ అతిలోక సుందరి శ్రీదేవి గుర్తొస్తుంది. గుండెల్లో గులాబీలు పూయించే ఓ రంగీలా ఊర్మిళ కళ్ల వాకిళ్లలో సుందరంగా నర్తిస్తుంది. "జాము రాతిరి జాబిలమ్మ..."అంటూ కీరవాణి సమకూర్చిన ఓ మంచి పాట నెమ్మదిగా చెవుల్లో గుసగుసలాడుతుంది. ఆపై... గాలిలోనే మాటిమాటికి వేలితోనే పేరు రాయడం... ఏమయిందో ఏమిటో? అంటూ ప్రేయసీ అన్వేషణలో తలమునకలైన ప్రియసఖుడి విరహం పలకరిస్తుంది... పల్లవిస్తుంది.

అంతలోనే ... ఓ రాత్రి చీకట్లో ఏకాంతంలో కూచుంటే... దెయ్యం వచ్చి మీద పడి నానా బీభత్సం చేసినట్లు ఒక్కసారిగా వెన్నులో వణుకూ పుడుతుంది. అదే సమయంలో అండర్‌ వరల్డ్‌ మాఫియా దారుణ మారణాలు గుర్తొచ్చి మనమెంత ప్రమాదకర ప్రపంచంలో ఉన్నామో తెలిసి నిలువెల్లా భయం కలుగుతుంది.

సృష్టిలోని అందమంతా స్త్రీలోనే పొందుపరిచాడంటూ... ఆ అందాల్ని సప్త వర్ణాల ఇంద్రధనుస్సుల్లా అత్యద్భుతంగా పరిచేసిన ఆయనే... లోకంలోని పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టుల కథల్ని పరిచయం చేసి... ఇదీ అసలైన నిజమంటూ చెప్పడం గుర్తొస్తుంది.

అవును... ఆయన భిన్నమైన సామాజిక నేపధ్యాల్లో విభిన్నమైన సినిమాలెన్నో తీశారు. భారతీయ సినిమా కెమెరా కన్నుకి కొత్త చూపు ఇచ్చారు. వెండితెరకు సరికొత్త రూపు సమకూర్చారు. ఆయనే... ఆర్జీవీ. ఆర్జీవీ...అంటూ ఇండస్ట్రీతో పాటు సినీ ప్రేక్షకులంతా ఆత్మీయంగా పిలుచుకునే... రామ్‌ గోపాల్‌ వర్మ.

ఆయన సృజన ఆకాశమంత. 1989లో 'శివ' చిత్రం ద్వారా దర్శకుడిగా ప్రపంచం ముందుకు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సినిమాతో అనుబంధాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

'శివ' ముందు 'శివ' తర్వాత

శివ ముందు... శివ తర్వాత అనే సృజనాత్మక విభజన రేఖను తెలుగు చిత్రసీమలో స్పష్టంగా లిఖించిన దర్శకుడు ఆర్జీవి. ఆయన ఎన్నో రకాలుగా స్ఫూర్తి. అప్పట్లో ఓ కొత్త దర్శకుడు మెగా ఫోన్‌ పట్టాలంటే... దశాబ్దాల తరబడి అసిస్టెంట్లుగా నలిగిపోవాల్సిందే. ఆర్జీవి వచ్చి ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. అంతకు ముందు నాగార్జున నటించిన ‘కలెక్టరుగారబ్బాయి’ చిత్రానికి నాలుగో సహాయ దర్శకుడిగా పనిచేశారన్న మాటే కానీ... ఆ ఒక్క సినిమాతోనే సినిమా రూపకల్పనలో అవసరమైన అవగాహన అందుకున్నారు ఆర్జీవి. ఆ సమయంలోనే నాగార్జునతో ఏర్పడిన అనుబంధంతో ‘శివ’ కథ చెప్పారు. ఆయనకీ ఈ కథ నచ్చడంతో కొన్నాళ్ల తరవాత తెరరూపం దాల్చింది. దాని కోసం ఎన్ని పురిటి నొప్పులో...ఒక్క ఆర్జీవీకే తెలుసు.

e tv bharat rgv spl story
ఆర్జీవీ మొదటి సినిమా

కాలేజీ నేపథ్యంలో రౌడీ, దాదాగిరి చేస్తున్న విద్యార్థుల ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. అప్పటి వరకూ మూస సినిమాల ఒరవడిలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకి ‘శివ’ సరికొత్త జవజీవాల్ని అందించిందనే చెప్పాలి. చిత్రీకరణ దగ్గర్నుంచి ప్రతీ విషయం న్యూ ఏజ్‌ సినిమాకి నిలువెత్తు దర్పణమే. పోస్టర్‌ డిజైనింగ్‌ కూడా ప్రధాన ఆకర్షణ. సినిమాని ఇలాగే తీయాలనే పాత నిబంధనల చట్రాన్ని బద్దలు కొట్టుకుని... ఇలాగ కూడా తీయొచ్చు... అని నిరూపించిన సినిమా ‘శివ’. అప్పటికీ... ఇప్పటికీ ‘శివ’ సినిమా గుర్తుకు వస్తే... హీరో సైకిల్‌ చైన్‌ లాగుతున్న పోస్టర్‌ ప్రేక్షకుల గుండె గోడ మీద కచ్చితంగా వేలాడుతూ హలో చెప్పక మానదు. అంతలా... ‘శివ’ సంచలనాల్ని నమోదు చేసింది.

‘శివ’ సినిమా విడుదల తరువాత ... ఆర్జీవి అనే కొత్త దర్శకుడు పుట్టుకొచ్చాడనే ఆనందంతో పాటు... ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు రూపొందుతాయనే నమ్మకం అటు ఇండస్ట్రీకి, ఇటు ప్రేక్షకులకి కలిగింది. ఆర్జీవి ఆ నమ్మకాన్ని ఏనాడూ వమ్ము చేసుకోలేదు. మిస్సయిల్లా దూసుకుపోతూ చిత్ర చిత్రానికి ఎదిగిపోతూ చివరాఖరికి బిగ్‌బిని సైతం డైరెక్ట్‌ చేసే స్థాయికి ఎదిగారు. అయన ప్రతి సినిమా ప్రత్యేకమే. వైవిధ్యభరితమే. యువ ప్రేమను తెరకెక్కించారు. అధోజగత్‌ కధల్ని అతి నగ్నంగా చూపించారు. మాఫియా, హర్రర్‌ చిత్రాల్ని రూపిందించారు. చిన్నప్పటినుంచి ఎవరినయినా భయపెట్టడమంటే ఆర్జీవికి ఎంతో ఇష్టమట. ఆ ఇష్టాన్ని నెరవేర్చుకునేందుకు కొన్ని దెయ్యాల సినిమాలు కూడా తీశారు. ‘రాత్రి’, ‘దెయ్యం’, ‘భూత్‌’ ఇలా సినిమాలు తీశారు. చిత్రమేమిటంటే... ఈ సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆర్జీవి ఆశించినంతగా భయపెట్టలేదు. కల్పిత కధలే కాకుండా వాస్తవాధారిత కథలను కూడా తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. గ్యాంగ్‌స్టర్‌ల నేపథ్యంలో కొన్ని సినిమాలను తెరకి ఎక్కించిన వర్మ సీమ నేపథ్యంలో సినిమాలు తీశారు. ‘సత్య’ సినిమా ఈ తరహాదే. ఈ సినిమా సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ ఎంపిక చేసిన భారతదేశంలో నిర్మితమైన వంద గొప్ప సినిమాల జాబితాలో ఒకటిగా చోటు దక్కించుకుంది. 2008 ముంబాయ్‌ అటాక్స్‌ నేపథ్యంలో ఆర్జీవి ‘ఇన్‌ ది అటాక్స్‌ ఆఫ్‌ 26/11’ అనే సంచలనాత్మక సినిమా తీశారు. అలాగే, గంధం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ చిత్రాన్ని తీశారు. రాయలసీమ ఫ్యాక్షన్‌ ఆధారంగా ‘రక్త చరిత్ర’ రెండు భాగాలు తీశారు. అలాగే, విజయవాడ అల్లర్ల నేపథ్యంలో ‘వంగవీటి’ అనే సినిమాను రూపొందించారు. తెలుగు, కన్నడతో పాటు బాలీవుడ్‌లోనూ ఆర్జీవి చక్రం తిప్పారు. వర్మ కార్పొరేషన్‌ పేరుతో పలు చిత్రాలు నిర్మించారు.

అతిలోక సుందరికి ఆర్జీవి ప్రేమలేఖ

చిత్ర సీమలో అతిలోక సుందరి అంటే అందాల శ్రేదేవి మాత్రమే. ఆమెని దగ్గర్నంచి చూడాలని తహతహలాడే ఎంతో మందిలో ఆర్జీవి కూడా ఒకరు. అయితే... సాక్షాత్తూ ఆమెనే డైరెక్ట్‌ చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. శ్రీదేవితో ఆయన తీసిన మొట్ట మొదటి చిత్రం ‘క్షణక్షణం’. ఆ తరువాత ‘గోవిందా...గోవిందా’. ఈ రెండు చిత్రాల్లో ‘క్షణక్షణం’ అంటే ఆర్జీవికి ప్రాణం. ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ ఆ సినిమా తాను శ్రీదేవికి రాసిన ప్రేమలేఖగా అభివర్ణించారు. శ్రీదేవి హఠాత్‌ మరణం ఆర్జీవిని ఎంతో కృంగదీసింది.

ఇక, ఆయన తీసిన చిత్రాల్లో అంతం, గాయం, మనీ, తిరుడా తిరుడా, రంగీలా, గులాబీ, అనగనగా ఒక రోజు, దౌడ్, సత్య, వైఫ్‌ ఆఫ్‌ వరప్రసాద్, ప్రేమకధ, కౌన్, మస్ట్, జంగిల్, లవ్‌ కె లిఏ కుచ్‌ కరేగా, ప్యార్‌ తూనే క్యా కియా, కంపెనీ, రోడ్, భూత్, గాయబ్, మధ్యాహ్నం హత్య, మై మాధురి దీక్షిత్‌ బన్‌నా చాహతి హూ, డి, జేమ్స్, సర్కార్, మిస్టర్‌ యా మిస్, సర్కార్‌ రాజ్, కాంట్రాక్ట్, పూంక్, పూంక్‌ 2, రక్షా, కధ స్కీన్ర్‌ ప్లే దర్శకత్వం అప్పల రాజు, దొంగల ముఠా, బెజవాడ, నాట్‌ ఏ లవ్‌ స్టోరీ, డిపార్ట్‌ మెంట్, బూత్‌ రిటర్న్స్, సత్య 2, రౌడీ, ఐస్‌ క్రీమ్, ఐస్‌ క్రీమ్2, 365 డేస్, లక్మీస్‌ ఎన్టీఆర్‌... ఇలా చాలా ఉన్నాయి.

అవార్డులు-పురస్కారాలు

1999లో ‘షూల’ సినిమాకి హిందీలో బెస్ట్‌ ఫీచర్‌ ఫిలింగా జాతీయ పురస్కారాన్ని ఆర్జీవీ అందుకున్నారు. 1989లో ‘శివ’ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రెండు నందులు అందుకున్నారు. వంశీ బర్కలీ అవార్డు కూడా అందుకున్నారు. 1991లో ‘క్షణక్షణం’ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా, బెస్ట్‌ స్కీన్ర్‌ ప్లే రైటర్‌గా మరోసారి రెండు నందులు అందుకున్నారు. 1993లో ‘మనీ’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా వెండి నందిని స్వీకరించారు. 1993లో ‘గాయం’ సినిమాకి గాను ఉత్తమ డైరెక్టర్‌గా ఆకృతీ సాంస్కృతిక సంస్థ పురస్కారాన్ని స్వీకరించారు. 1999లో ‘ప్రేమకథ’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా మళ్లీ నంది పురస్కారం స్వీకరించారు. అదే చిత్రం ఉత్తమ చిత్రంగా కాంస్య నందిని అందుకున్నారు.

e tv bharat rgv spl story
ఆర్జీవీ

ఫిలిం ఫేర్‌ అవార్డులు

1995లో ‘రంగీలా’ సినిమాకి బెస్ట్‌ స్టోరీ అవార్డు అందుకున్నారు. 1998లో ‘సత్య’ సినిమాకి ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్‌ క్రిటిక్స్‌ అవార్డు అందుకున్నారు. అదే చిత్రానికి బెస్ట్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌ మూవీ అవార్డు అందుకున్నారు. 2000లో ‘జంగిల్‌’, 2002లో ‘కంపెనీ’, 2003లో ‘భూత్‌’ సినిమాలకు గాను బెస్ట్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌ మూవీ అవార్డులను అందుకున్నారు.

వ్యక్తిగతం

ఆర్జీవీ 1962 ఏప్రిల్‌ 7న జన్మించారు. ఆయన తల్లి సూరమ్మ, తండ్రి కృష్ణంరాజు. కృష్ణంరాజు అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసేవారు. ఆర్జీవీ విజయవాడలోని సిద్దార్ధ కాలేజీలో ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం. కాలేజీ ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసేవారు. ఒక్కో సినిమాని పదే పదే చూసి దర్శకత్వపు మెళకువలు అవగాహనా పరచుకున్నారు. ప్రత్యేకించి... ఏ ఫిల్మ్‌ బై... అనే కాప్షన్‌ కింద వచ్చే దర్శకుల పేర్లను ఎంతో ఆరాధనతో చూసేవారు. తాను కూడా ఏదో ఓ రోజు... అంతటివాడిని కావాలన్నదే ఆయన కల. ఇంట్లో పెద్దలు డబ్బు సంపాదించడం కోసం ఏదో ఒకటి చేయమని పోరుతూ ఉండేసరికి... నైజీరియాకి ఉపాధి కోసం వెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకుని చివరి నిముషంలో మనసు మార్చుకుని అమీర్‌పేటలో వీడియో షాప్‌ పెట్టారు. అందువల్ల చాలామంది సినీ పెద్దలతో పరిచయాలు అయ్యాయి. ఆఖరికి... ‘శివ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన సత్తా నిరూపించుకున్నారు.

వివాదాలు కూడా

ఆర్జీవీ అంటే... ఓ సంచలనం. సినిమాల ద్వారా వినోదాన్ని అందించడమే కాదు... తరచూ వివాదాలు కొని తెచ్చుకోవడం కూడా ఆయన శైలి. ఆయన మౌనంగా ఉన్నా, మాట్లాడినా, సినిమా తీసినా, తీయకున్నా మీడియా ఫోకస్‌ ఎప్పుడూ ఆయన మీదే ఉంటుంది. ఉరుము ఉరిమినట్లు హఠాత్తుగా ట్వీట్‌ చేసినా ఉలిక్కిపడే జనాలెంతో మంది. ఈ భూమ్మీద...ఆకాశం కింద ఏ అంశమైనా ఆయన కళ్లల్లో పడితే పిచ్చ పబ్లిసిటీ. అంతేనా! పొగరనిపించే ముక్కుసూటితనం, నా ఇష్టం...నేనింతేనంటూ లోకం ముందు తన గురించి చెప్పుకోవడంలో నిజాయితీ కన్నా జనాలకు నిర్లక్ష్యం కనిపిస్తే ...అది కచ్చితంగా ఆయన తప్పు కాదు. ఆయన్ని అర్ధం చేసుకోవడంలో విఫలమైన జనాలదే పొరపాటు. ఆయన తన శైలిలో అన్నీ చెప్తారు. ఒక్కొక్కరికీ ఒక్కోలా అర్ధమవుతుందంతే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.