ఆధునిక ఇతిహాసాల సైన్స్ ఫిక్షన్ నేపథ్యాలను కథలుగా మలిచే మాస్టర్.. డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'డూన్'. ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన డూన్ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తిమోతీ చాల్‌మెట్, రెబెకా ఫెర్గూసన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ చిత్రాన్ని లెజెండరీ పిక్చర్స్, విల్లెనెయువ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది.
చిత్ర కథేంటంటే.. రాబోయే కాలంలో ఈ మానవ ప్రపంచంలో ప్రమాదకరమైన ఎడారి గ్రహం అరికాస్‌గా గుర్తించబడుతుంది. దీనిని డూన్ అని కూడా పిలుస్తారు. విశ్వంలోని అత్యంత విలువైన పదార్థం అక్కడ ఉంటుంది. మానవునికి అతీతంగా ఆలోచించే పదార్థం. మనిషి జీవితకాలాన్ని పెంచే పదార్థం, మన ఆలోచనల స్థాయిని పెంచుతూ తేలికగా, ఎంతదూరమైన ప్రయాణాన్నైనా సాధ్యం చేసుకోవచ్చు. టూకీగా చిత్ర కథ ఇది.
ఇందులో పాల్ అట్రైడెస్‌గా, తిమోతీ చాలమెట్ నటించగా, లేడీ జెస్సికాగా రెబెకా ఫెర్గూసన్ కనిపించింది. వార్నర్ బ్రదర్స్ పంపిణీదారుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని యు.కె., యూఎస్ఏలతో పాటు కెనడా, హంగేరిల్లో డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">