ETV Bharat / sitara

తారాలోకం.. కొందరు సేవతో, మరికొందరు జ్ఞాపకాలతో - lockdown effect on movie industry

లాక్​డౌన్​తో సినిమా షూటింగ్​లు లేకపోవడం వల్ల సినీ తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చట్లు పెడుతున్నారు. కొందరు సమాజ సేవ చేస్తూ కనిపిస్తుంటే.. మరికొందరు నృత్యాలతో అలరిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఏమేం చేశారంటే?

Due to the lack of film shooting with lock down, all the movie stars were confined to the house. This is how social media is engaging with fans.
ప్రణీత గొప్ప మనసు.. ‘లోఫర్‌’ భామ స్టెప్పులు!
author img

By

Published : May 24, 2020, 8:17 PM IST

లాక్‌డౌన్‌లో సినీ తారలు నెటిజన్లకు మరింత చేరువయ్యారు. షూటింగ్‌లు, ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడిపే వీరంతా ఇంటికే పరిమితం కావడం వల్ల సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో తమ భావాల్ని పంచుకుంటున్నారు. ఇలా ఆదివారం కొందరు పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. మరికొందరేమో సమాజ సేవ చేస్తూ.. అభిమానులకు కూడా పిలుపునిచ్చారు. నృత్యంతో ఆకట్టుకున్న వారూ ఉన్నారు. నటి ప్రణీత ఆటో డ్రైవర్లకు శానిటైజర్లు పంపిణీ చేశారు. అంతేకాదు డ్రైవర్‌కు, వెనుక ఉన్న ప్రయాణికుడికి మధ్య పారదర్శకంగా ఉండే కవర్‌ ఉండాలని సూచిస్తూ షీట్లను కూడా పంచారు. వీటిని వంద మంది డ్రైవర్లకుపైగా ఇచ్చినట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు.

ఆదివారం బ్రదర్స్‌ డే సందర్భంగా మంచు లక్ష్మి తన సోదరులు విష్ణు, మనోజ్‌పై ఉన్న ప్రేమను తెలిపారు. భౌతికంగా తమ మధ్య ఎంత దూరం ఉన్నా ఎప్పటికీ మనసుకు చేరువగానే ఉంటారని అన్నారు. ఇలా మన తారలు సోషల్‌మీడియా ఖాతాల్లో ఏం షేర్‌ చేశారో చూద్దాం రండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.