ETV Bharat / sitara

'ఢీ' సీక్వెల్​పై దర్శకుడి క్లారిటీ.. త్వరలో షూటింగ్ షురూ - ఢీ సీక్వెల్ షూటింగ్

మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చి హిట్ అందుకున్న చిత్రం 'ఢీ'. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్​ రూపొందిస్తున్నారు. దానికి సంబంధించిన ఓ అప్​డేట్ ఇచ్చాడు దర్శకుడు శ్రీను.

Double dose shooting starts soon
త్వరలోనే పట్టాలెక్కనున్న 'ఢీ' సీక్వెల్​
author img

By

Published : Feb 4, 2021, 9:58 AM IST

'ఢీ'.. మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం. విష్ణు, జెనీలియా, శ్రీహరి నటనతోపాటు బ్రహ్మానందం, సునీల్‌ కామెడీ టైమింగ్‌ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2007లో వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్​గా 'డబుల్ డోస్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం.

ఇప్పటికే ఈ సినిమా కోసం విష్ణు కసరత్తులు మొదలుపెట్టాడు. తను చెమటోడుస్తున్న ఫొటోను నెట్టింట పోస్ట్ చేస్తూ దర్శకుడు శ్రీను వైట్ల ఈ సీక్వెల్​కు సంబంధించిన అప్​డేట్ ఇచ్చాడు. "సినిమాలో పాత్ర కోసం మీరు పడుతున్న కష్టం గొప్పది. మేము కూడా స్క్రిప్ట్ కోసం అంతే స్థాయిలో శ్రమిస్తున్నాం. త్వరలోనే షూటింగ్ మొదలెడదాం." అంటూ ట్వీట్ చేశాడు దర్శకుడు.

  • My dear brother @iVishnuManchu , the commitment and hardwork which you are putting in for the perfect look is enormous for D&D (Double Dose) and we are doing the same for the script.Our hard work will pay . Let’s go on floors soon . 👍👍 pic.twitter.com/2Y8Errv4ze

    — Sreenu Vaitla (@SreenuVaitla) February 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.