బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ప్రస్తుతం మాల్దీవులు పర్యటనను ఎంజాయ్ చేస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ నెట్టింట తన ఫొటోలతో సందడి చేస్తోంది. ఇందులో తను పోస్ట్ చేసిన బికినీ ఫొటో కుర్రకారు మతిపోగొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు దిశా అందాన్ని పొగిడేస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
పర్యటనను జంటగా ఆస్వాదిస్తోన్న ఈ జోడీ ఇప్పటివరకు వారు కలిసి ఉన్న ఫొటోను మాత్రం పోస్ట్ చేయలేదు. కానీ ముంబయి నుంచి మాల్దీవులు వెళుతూ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కారు. ఇప్పటికే రెండేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న టైగర్-దిశా అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం 'ఏక్ విలన్ రిటర్న్స్', 'రాధే' చిత్రాలతో బిజీగా ఉంది దిశా. అలాగే టైగర్ ష్రాఫ్ 'గణపత్' షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇందులో కృతి సనన్ హీరోయిన్. అలాగే తన మొదటి చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న 'హీరోపంతి 2'కూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
![Disha Patani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11457267_673_11457267_1618815776798.png)