ETV Bharat / sitara

ఫొటోగ్రాఫర్​తో హీరోయిన్ బాడీగార్డ్ దురుసు ప్రవర్తన - entertainment news

హీరోయిన్​ దిశా పటానీ బాడీగార్డ్.. ఓ ఫొటోగ్రాఫర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఫొటోగ్రాఫర్​తో హీరోయిన్ బాడీగార్డ్ దురుసు ప్రవర్తన
హీరోయిన్​ దిశా పటానీ
author img

By

Published : Feb 25, 2020, 6:47 AM IST

Updated : Mar 2, 2020, 11:57 AM IST

బాలీవుడ్​ నటి దిశాపటానీ ఇటీవలే 'మలంగ్'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందీ సినిమా. తాజాగా ఈమె విషయంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఈ మధ్యే ఓ ఈవెంట్​కు హాజరైంది దిశాపటానీ. అనంతరం వచ్చి కారులో ఎక్కుతుండగా, అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్​ ఆమె ఫొటోలు తీయడానికి దగ్గరకొచ్చాడు. ఆ సమయంలో ఈ ముద్దుగుమ్మ బాడీగార్డ్.. అతడిని అడ్డుకున్నాడు. బాడీగార్డ్ ప్రవర్తనతో ఫొటోగ్రాఫర్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఈ చర్య పట్ల అక్కడే ఉన్న మిగిలిన ఫొటోగ్రాఫర్లు నిరసన వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పకపోతే దిశా పటానీ కార్యక్రమాలను బహిష్కరిస్తామని అన్నారు. వెంటనే ఆమె మేనేజర్ జరిగిన ఘటన పట్ల క్షమాపణ చెప్పాడు.

Last Updated : Mar 2, 2020, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.