రవితేజ 'డిస్కోరాజా' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే గోవాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే ఐస్‌ల్యాండ్ ప్రయాణం కానుంది. ఇక్కడ తీయబోయే ఓ సన్నివేశానికి భారీగా ఖర్చుపెడుతున్నారు నిర్మాతలు. కేవలం 4 నిమిషాల నిడివి ఉండే ఓ సీన్ కోసం రూ.4-5 కోట్లు వెచ్చించనున్నారు.
ఈ యాక్షన్ సన్నివేశం కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను ఎంపిక చేసింది చిత్రబృందం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' చిత్రానికి పనిచేసిన స్టంట్ మాస్టర్స్ పనిచేయనున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చెబుతోంది చిత్రబృందం.
ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్, తాన్యాహోప్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇదీ చూడండి: 'బసవతారకం' నుంచి శకుంతలా దేవిగా