ETV Bharat / sitara

వకీల్​సాబ్ కథ​ త్రివిక్రమ్​ రాయాల్సింది.. కానీ! - పవన్​కల్యాణ్​ వకీల్​సాబ్​ వార్తలు

"ప్రతి దర్శకుడు తన ప్రత్యేకతని ప్రదర్శించే ప్రయత్నంలో ఉంటాడు. చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, జీవితంలో జరిగిన సంఘటనలే వాళ్ల శైలిపై ప్రభావం చూపిస్తుంటాయి" అంటారు దర్శకుడు శ్రీరామ్‌ వేణు. ఆయన మూడో ప్రయత్నంలోనే పవన్‌కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పవర్​స్టార్‌తో 'వకీల్‌సాబ్‌' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రయాణం గురించి శ్రీరామ్‌ వేణు చెప్పిన ముచ్చట్లివే..

pawan venu
'పవన్​కల్యాణ్​.. కంగారులోనూ 'గారు' మరిచిపోరు'
author img

By

Published : Jun 7, 2020, 7:12 AM IST

పవన్‌ కల్యాణ్‌ నుంచి ప్రతి రోజూ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఆయన అంకితభావంతో పనిచేస్తుంటారు. చుట్టూ ఉన్న మనుషులందరినీ ఒకేలా చూడటం, గౌరవించడం ఆయనలో గమనించిన మరో గొప్ప లక్షణం. కంగారులోనైనా 'గారు' అని సంబోధించడం మరిచిపోరు. సెట్‌లో సమయం దొరికిందంటే అందరితో సరదాగా మాట్లాడతారు. మన గురించి అన్ని వివరాలు తెలుసుకుంటారు. మొదట 'పుస్తకాలు చదువుతారా? ఏం చదివారు?' అని అడుగుతారు. ఆయన అభిమానిగా నేను ఫీల్‌ అయినవి చెప్పుకోవడానికే సమయం సరిపోయింది (నవ్వుతూ).

.

Pawan Kalyan movie news
పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​

పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేయాలనే కోరిక మొదట్నుంచీ ఉండేదా?

ఇష్టమైన కథానాయకుడితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడికీ ఉంటుంది. పవన్‌ అభిమానిని నేను. 'ఖుషి' 22 సార్లు, 'గబ్బర్‌సింగ్‌' 23 సార్లు చూశా. ఇష్టమైన స్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం.

రీమేక్‌ కాకుండా.. సొంత కథతో చేసే అవకాశం వచ్చుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా?

మన హీరోని ఇలాంటి కథలో చూసుకోవాలనే ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. అలాగని రీమేక్‌ తక్కువ కాదు. 'పింక్‌' ఆధారంగా తెరకెక్కుతున్న 'వకీల్‌సాబ్‌'.. పవన్‌ స్థాయికి తగ్గ చిత్రం. సమాజానికి చెప్పాల్సిన కథ ఇందులో ఉంది.

'వకీల్‌సాబ్‌' అవకాశం ఎలా వచ్చింది?

'వకీల్‌సాబ్‌'కి ముందు వేరే సినిమా ప్రయత్నాల్లో ఉన్నా. అప్పుడు అనుకోకుండా దిల్‌రాజుతో కలిసి త్రివిక్రమ్‌ దగ్గరికి వెళ్లా. 'పింక్‌' రీమేక్‌ గురించి వాళ్లిద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ అవకాశం నాకే వస్తుందని అప్పుడు ఊహించలేదు.

విరామం తర్వాత పవన్‌ చేస్తున్న సినిమా. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఎలాంటి కసరత్తులు చేశారు?

ఒక మంచి మాట చెప్పడానికి.. చెప్పేవాళ్లకి ఓ స్థాయి ఉండాలి. అప్పుడే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అలా ఇందులో ఒక గొప్ప విషయం ఉంది. దాన్ని పవన్‌ నోటి నుంచి చెప్పించడం కంటే గొప్ప కమర్షియాలిటీ మరొకటి లేదు. ఈ కథకి కొన్ని పరిమితులున్నాయి. కానీ వాటిలోనే అభిమానులకి కావాల్సిన వాణిజ్యాంశాల్ని సృష్టించాం.

పవన్‌తో తొలి రోజు సెట్లో అనుభవమేంటి?

పవన్‌ భావాలకి దగ్గరగా ఉన్న సినిమా ఇది. ఆయన ఫీల్‌ అయిన విషయాలన్నీచెప్పారు. కొంచెం సమయం తీసుకుని 'నేనిలా అనుకుంటున్నాను సర్‌' అని చెప్పి ఒప్పించా. తొలి రోజే ఆయన మీద సన్నివేశాల్ని తెరకెక్కించా. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో సన్నివేశం అదే.

మీ ప్రయాణం మీకు ఏం నేర్పింది?

తొలి చిత్రం 'ఓ మై ఫ్రెండ్‌' తర్వాత ఒక సినిమా ప్రారంభమై ఆగిపోయింది. మరో సినిమా కోసం ఏడాది కష్టపడ్డాక మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 'ఎమ్‌.సి.ఎ' చేశాను. ఈ అనుభవాలతో వర్తమానంలో బతకడమే అలవాటైంది.

ఈ సినిమా స్క్రిప్టులో త్రివిక్రమ్‌ భాగస్వామ్యం ఉందా?

మొదట త్రివిక్రమ్‌ రాస్తారని చెప్పారు. కానీ కుదరలేదు. ఆ సమయంలో ఆయన 'అల వైకుంఠపురములో' హడావిడిలో ఉన్నారు. అది విడుదలైన నాలుగైదు రోజులకే 'వకీల్‌సాబ్‌' చిత్రీకరణ మొదలుపెట్టాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.