కొత్తవాళ్ల రాకతో, వారి సరికొత్త ఆలోచనలతో చిత్రపరిశ్రమ రూపమే మారిందన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. ఆనంద్ దేవరకొండ- శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన 'దొరసాని' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
"కథలో, సినిమాలో ఇలా ప్రతీ దానిలో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త వారి రాకతో చిత్రపరిశ్రమ రూపమే మారిపోతోంది. ఈ సినిమాను తెరకెక్కించిన మహేంద్ర ఇంతకు ముందు 'నిశీధి' అనే లఘు చిత్రం తీశాడు. దాదాపు 30 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది.
దొరసాని పాత్రకు శివాత్మిక చక్కగా కుదిరింది. అచ్చ తెలంగాణ ఆడపడుచులా ఉంది. తన సోదరుడు విజయ్ దేవరకొండ మాటల్లో ఉన్నంత నిజాయితీ ఆనంద్‌లో కనిపిస్తోంది" -సుకుమార్, దర్శకుడు
1980ల నాటి తెలంగాణ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉండనుంది. ఈ విషయం ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించాడు. మధుర శ్రీధర్, యశ్ రంగినేని నిర్మాతలు. కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: దొరసాని: మా ప్రేమ కూడా ఓ ఉద్యమమే