ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి చెన్నైలో నిరాడంబరంగా జరిగింది. క్రికెటర్ రోహిత్ దామోదరన్‌ను కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. చెన్నైలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హాజరై, వధూవరులను దీవించారు.
కరోనా కారణంగా కొద్దిమంది సమక్షంలో ఈ పెళ్లి జరగ్గా, సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత భారీస్థాయిలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
శంకర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రకటించగా, షూటింగ్ మొదలుకావాల్సి ఉంది. మరోవైపు ఆయన దర్శకత్వం వహిస్తున్న 'భారతీయుడు 2'.. పలు కారణాలతో ఆగిపోయింది.
ఇవీ చదవండి: