Director ramesh varma khiladi movie: "మంచి కథతో తీసిన విందు భోజనం లాంటి సినిమా 'ఖిలాడి'. ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. ఎక్కడా నిరాశపరచదు" అని అన్నారు రమేష్ వర్మ. 'రాక్షసుడు' వంటి హిట్ తర్వాత ఆయన తెరకెక్కించిన చిత్రమే 'ఖిలాడి'. రవితేజ కథానాయకుడిగా నటించారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలు. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు రమేష్ వర్మ.
అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. ఏడుపు, భయం, యాక్షన్, కామెడీ, ఆశ్చర్యం.. ఇలా అన్ని రకాల భావోద్వేగాల సమాహారంగా ఉంటుంది. ఆద్యంతం థ్రిల్ చేస్తుంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. ఆ రెండు పాత్రలు వేటికవే భిన్నంగా కొత్తగా ఉండనున్నాయి. సినిమాలో ఆయన ఎనర్జీ లెవల్ మరోస్థాయిలో కనిపిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ ఇటలీ, ఒమన్, దుబాయ్ వంటి దేశాల్లో జరిగింది. కథరీత్యానే అక్కడ చేయాల్సి వచ్చింది. సినిమాలో యాక్షన్‌కు పెద్ద పీట వేశాం. ఇవన్నీ హాలీవుడ్ స్టైల్‌లో ఉంటాయి. దాదాపు రూ.45కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మించారు.
*'రాక్షసుడు' హిందీ రీమేక్ కోసం సిద్ధమవుతున్న సమయంలో నా సొంత కథతో ఓ సినిమా చేస్తే బాగుంటుందని నిర్మాతతో అన్నా. దానికి ముందు తమిళంలో ఓ సినిమా చూశాం. అది పెద్ద హీరోకు వర్కవుటవ్వదు. ఆ తర్వాత ఈ కథను నిర్మాతకు చెప్పడం.. ఆయనకు నచ్చి రవితేజకు చెప్పించడం.. విన్న వెంటనే ఆయన చేస్తాననడం చకచకా జరిగిపోయాయి. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా పెద్ద హీరోయిన్లనే అనుకున్నాం. వారు ఎందుకనో చేయనన్నారు. తర్వాత మీనాక్షి, డింపుల్‌ను నాయికలుగా తీసుకున్నాం.
* నేను ఏ విషయంలోనైనా ఓపెన్‌గా ఉంటాను. రవితేజ అంతే. ఆయన 'వీర' తర్వాత నాకు సినిమా ఇవ్వలేదు. 'రాక్షసుడు' హిట్ కాబట్టి నాకు ఈ చిత్రమిచ్చారు. ఇప్పుడీ సినిమాతో సక్సెస్ కొడితే మరో చిత్రానికి ఛాన్స్ ఇస్తారు. రవితేజది చిన్నపిల్లాడి మనస్తత్వం. కోపం వస్తుంది. ఆ తర్వాత నవ్విస్తారు. దగ్గరకు తీసుకుంటారు. నేను ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నా. 'రాక్షసుడు 2', 'యోధ' సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ముందు ఏది సెట్స్‌పైకి వెళ్తుందన్నది త్వరలో తెలుస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: