ETV Bharat / sitara

'దృశ్యం' దర్శకుడిపై రాజమౌళి ప్రశంసలు - రాజమౌళి

'దృశ్యం' దర్శకుడు జీతూ జోసెఫ్​ను ప్రశంసించారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ చిత్రం అద్భుతంగా ఉందని కొనియాడిన ఆయన.. ఆ సినిమా చూశాక తన ఆలోచలన్నీ దాని చూట్టూనే తిరిగాయని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన కథ అని కితాబిచ్చారు.

rajamouli
రాజమోళి
author img

By

Published : Mar 14, 2021, 6:52 PM IST

మలయాళ చిత్రాలు 'దృశ్యం', 'దృశ్యం 2' దర్శకుడు జీతూ జోసెఫ్‌ను ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి ప్రశంసించారు. సినిమాపై తన అభిప్రాయాన్ని జీతూకు వాట్సాప్​ చేశారు.

"హాయ్‌ జీతూ.. నేను దర్శకుడు రాజమౌళిని. కొన్ని రోజుల క్రితం 'దృశ్యం 2' చిత్రం చూశా. సినిమా చూసిన తర్వాత ఆలోచలన్నీ దాని చుట్టూనే తిరిగాయి. వెంటనే మళ్లీ ఒకసారి మలయాళ 'దృశ్యం' చూశా. (తెలుగులో విడుదలైన వెంటనే ఆ సినిమా అప్పుడే చూశా) దర్శకత్వం, స్క్రీన్​ ప్లే , ఎడిటింగ్‌, యాక్టింగ్‌.. ప్రతి విభాగం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రచనా విధానం గొప్పగా ఉంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన కథ ఇది. 'దృశ్యం' ఒక మాస్టర్‌పీస్‌. అదే ఉత్కంఠతో 'దృశ్యం 2'ను తీసుకురావడం గొప్ప విషయం. మీ నుంచి మరికొన్ని మాస్టర్‌పీస్‌ చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను' అని జీతూకి సందేశం పంపించారు రాజమౌళి. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటూ రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేశారు జీతూ.

మోహన్‌ లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఫిబ్రవరి 19న విడుదలైంది. ఇదే సినిమాను తెలుగులో వెంకటేశ్‌ కథానాయకుడుగా తెరకెక్కిస్తున్నారు జీతూ జోసెఫ్‌.

'దృశ్యం' రీమేక్‌ అయిన అన్ని భాషల్లోనూ ఘన విజయం అందుకుంది.

ఇదీ చూడండి: ఆ వదంతులు నమ్మొద్దు: 'దృశ్యం' దర్శకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.