Rajamouli in Unstoppable with NBK: 'అఖండ' సినిమాతో థియేటర్ల దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య.. ఓటీటీలోనూ అదరగొడుతున్నారు. 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' టాక్ షోతో అభిమానుల్ని అలరిస్తున్నారు.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్స్‌లో మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ, నాని, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి, అఖండ చిత్రబృందం పాల్గొన్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో మరో ఎపిసోడ్‌ను తెరకెక్కించారు. ఇప్పుడు తాజాగా ఈ షోకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి వచ్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది ఆహా. త్వరలోనే ప్రోమోను విడుదల చేస్తామని తెలిపింది. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలోనూ రాజమౌళి పాల్గొని ప్రేక్షకులను అలరించారు.
![Director Rajamouli in Unstoppable with NBK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13910733_unstoppable.jpg)
![Director Rajamouli in Unstoppable with NBK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13910733_unstoppable1.jpg)
రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా తారక్ నటించారు. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్ , ఒలీవియా మోరీస్ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
![Director Rajamouli in Unstoppable with NBK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13910733_unstoppable4.jpg)
![బాలకృష్ణ రాజమౌళి, కీరవాణి, Director Rajamouli in Unstoppable with NBK](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13910733_unstoppable2.jpg)
ఇదీ చూడండి: విలన్‌గా నటించడానికి రెడీ: హీరో బాలకృష్ణ