పాన్ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం 'రాధేశ్యామ్' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పీరియాడికల్ ప్రేమకథగా రూపొందనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్లతో సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే టీజర్ రానుందని వెల్లడించారు రాధాకృష్ణ.
-
Teaser update is on the way guys!! Very very soon, till then just be patient!!! I promise your wait be worth a million smiles. #radheshyam
— Radha Krishna Kumar (@director_radhaa) January 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Teaser update is on the way guys!! Very very soon, till then just be patient!!! I promise your wait be worth a million smiles. #radheshyam
— Radha Krishna Kumar (@director_radhaa) January 5, 2021Teaser update is on the way guys!! Very very soon, till then just be patient!!! I promise your wait be worth a million smiles. #radheshyam
— Radha Krishna Kumar (@director_radhaa) January 5, 2021
"అతిత్వరలో 'రాధేశ్యామ్' టీజర్ అప్డేట్ రానుంది. అప్పటివరకు కాస్త ఓపిక పట్టండి. మీ నిరీక్షణకు తగిన సంతోషాన్ని టీజర్ అందిస్తుందని నేను భరోసా ఇస్తున్నా."
-రాధాకృష్ణ, దర్శకుడు
'రాధేశ్యామ్' తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్‌తో మరో చిత్రం చేయనున్నారు ప్రభాస్.
ఇదీ చూడండి: షారుక్‌కు వచ్చిందని ఆమిర్ అలిగాడు!