స్వర్గీయ నందమూరి తారకరామారావు వేసిన ఏ పాత్రకైనా ఇంకెవరూ సాటిరారు. ఆయన నటించిన భక్తి చిత్రాలు చూసిన ప్రేక్షకులు.. దేవుడు ఇలానే ఉంటాడేమో అనుకునేవారు. మరి అలాంటి వ్యక్తి ఓ సినిమాలో కచ్చితంగా నటించాలని పట్టుబట్టారట.
శ్రీనాథుడి కథను చిత్రంగా రూపొందించాలని ఎన్టీఆర్కు కోరిక ఉండేదట. ఈ విషయంపై బాపు రమణలతో మాట్లాడితే.. వాళ్లేమో "శ్రీనాథుడి జీవితంలో పెద్ద కథేం ఉండదు. సామాన్యులకి ఆయన ఎవరో తెలీదు. అది సినిమా తీయడం అంటే ఇబ్బందే. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందేమో!" అని అన్నారట.
ఆ మాటలకు బదులిచ్చిన ఎన్టీఆర్.. "ఏం ఫర్వాలేదు. నష్టం వచ్చినా నాకు ఇబ్బంది లేదు. మనం నిష్ఠగా కచ్చితమైన శ్రద్ధతో సినిమా తీద్దాం. ప్రజాదరణ పొందకపోయినా ఇబ్బంది లేదు. కొందరైనా ఆ సినిమా చూస్తారు. ఆ తృప్తి చాలు. ఏమైనా, శ్రీనాథుడి పాత్ర ధరించాలనేది నా కోరిక. అంతే" కచ్చితమైన నిర్ణయం చెప్పారట. అలా ఆయన పట్టుదల వల్లే శ్రీనాథుడి కథ వెండితెరపైకి వచ్చి.. ఎందరినో విశేషంగా ఆకట్టుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి... 'ఇన్స్టా హ్యాక్ అయింది.. ఆ సందేశాలు నేను పెట్టలేదు'