ETV Bharat / sitara

సేతుపతితో విభేదాలు.. 'విక్రమ్ వేద'కు ఆమిర్ దూరం! - విజయ్ సేతుపతి, ఆమిర్​ ఖాన్

తమిళ బ్లాక్​బస్టర్​ 'విక్రమ్​ వేద' హిందీ రీమేక్​ నుంచి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తప్పుకొన్నారని సమాచారం. నటుడు విజయ్​ సేతుపతితో కలహమే అందుకు కారణమని తెలుస్తోంది.

Differences with Vijay Sethupathi is why Aamir Khan backed out of Vikram Vedha remake?
విజయ్​ సేతుపతితో విభేదం.. సినిమా నుంచి తప్పుకున్న ఆమిర్!
author img

By

Published : Jan 9, 2021, 1:05 PM IST

బాలీవుడ్ సూపర్​స్టార్​ ఆమిర్ ఖాన్, సైఫ్​ అలీఖాన్ ప్రధానపాత్రల్లో తమిళ హిట్​ చిత్రం 'విక్రమ్​ వేద'ను హిందీలో రీమేక్​ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్​ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ చిత్రం​ నుంచి ఆమిర్ తప్పుకున్నారని సమాచారం​. కథలో ఏకాభిప్రాయం కుదరకే ఆమిర్​ తప్పుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ తమిళ నటుడు విజయ్ సేతుపతితో తలెత్తిన విభేదాలే అందుకు కారణమని తెలుస్తోంది.

ఆమిర్​ నటిస్తున్న 'లాల్​ సింగ్​ చద్ధా'లో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఇద్దరి మధ్య వైరుధ్యం ఏర్పడినట్లు సమాచారం. ఈ కారణంగానే తమిళంలో సేతుపతి పోషించిన 'వేద' పాత్రను చేయడానికి విముఖత వ్యక్తం చేశారట ఆమిర్.

ఆమిర్​ తప్పుకున్నా.. మాధవన్​ పోషించిన పవర్​ఫుల్ పోలీస్​ పాత్రలో సైఫ్ మెరవనున్నారు. మాతృకను తెరకెక్కించిన పుష్కర్​, గాయత్రిలే రీమేక్​కూ దర్శకత్వం వహించనున్నారు.

ఇదీ చూడండి: 'కోబ్రా' టీజర్.. 'ఏ1 ఎక్స్​ప్రెస్', టక్​ జగదీష్ అప్​డేట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.