బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్(Aamir Khan) ఇంటికి వస్తే ఎవరు మాత్రం రానివ్వకుండా ఉంటారు. ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తారు. అయితే గతంలో.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(Ganguly) ఇంటికి వెళ్తే ఆమిర్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైందట! అతడిని లోపలికి రానివ్వకుండా దాదా సెక్యురిటీ గార్డ్స్ అడ్డుకున్నారు. ఎంత బతిమలాడిన తన విన్నపాన్ని పట్టించుకోలేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆమిర్ తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇంతకీ ఏం జరిగిందంటే?
తన ప్రతి చిత్రానికి వైవిధ్యంగా ప్రమోషన్స్ చేస్తూ ఆకట్టుకుంటారు స్టార్ హీరో ఆమిర్ ఖాన్. అలానే 2009లో తన '3 ఇడియట్స్' సినిమా కోసం కూడా డిఫరెంట్‌గా ప్రమోషన్‌ను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఓ ప్రాంక్ వీడియో చేశారు. మారువేషంలో కోల్‌కతా రోడ్లపై తిరుగుతూ గంగూలీ ఇంటికి వెళ్లారు. అయితే ఆమిర్‌ను గుర్తుపట్టని దాదా ఇంటి సెక్యురిటీ గార్డ్లు ఆయన్ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. 'అభిమానిని, గంగూలీని కలిసి ఓ ఫొటో దిగి వెళ్లిపోతాను' అని ఎంత చెప్పినా అస్సలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తన కోసం వచ్చింది ఆమిర్ అని తెలుసుకున్న దాదా.. వెంటనే మిస్టర్ పర్ఫెక్ట్ను లోపలికి ఆహ్వానించి పసందైన విందును ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత గంగూలీని '3 ఇడియట్స్' సినిమా ప్రీమియర్ షోకు ఆహ్వానించారు ఆమిర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: వివాహ బంధానికి ఆమిర్ ఖాన్ దంపతుల గుడ్‌బై