ETV Bharat / sitara

యూఏఈలో కత్రినా కైఫ్​-విక్కీ కౌశల్​ ప్రేమజంట! - విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ ప్రేమ జంట

Vicky-Katrina wedding: బాలీవుడ్​ ప్రేమజంట కత్రినా కైఫ్​-విక్కీ కౌశల్​కు సంబంధించి రోజుకో పుకారు పుట్టుకొస్తోంది. వీరిద్దరూ గత నెలలో రహస్యంగా యూఏఈ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసిన ఫొటోల ఆధారంగా గాసిప్​లు మొదలయ్యాయి.

vicky katrina secret vacation
విక్కీ కౌశల్-కత్రినా కైఫ్
author img

By

Published : Dec 1, 2021, 4:45 PM IST

Updated : Dec 1, 2021, 6:09 PM IST

vicky katrina dating: బాలీవుడ్​ స్టార్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే పుకార్ల నడుమ వీరిద్దరూ రహస్యంగా యూఏఈ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరు తమ ఇన్​స్టాగ్రామ్​ల్లో పర్యటనకు సంబంధించిన ఫొటోలు పోస్ట్​ చేయడం వల్ల గాసిప్​లు మొదలయ్యాయి.

యూఏఈ ట్రిప్​కు సంబంధించిన ఫొటోలను విక్కీ కౌశల్​ తన ఇన్​స్టాగ్రామ్​లో మంగళవారం పోస్ట్​ చేశాడు. అబుదాబిలో జెట్​-స్కైయింగ్​ చేస్తూ ఎంజాయ్​ చేసిన దృశ్యాలను అభిమానులతో షేర్ చేశాడు. విక్కీ పోస్ట్​ చేసిన కొద్ది సేపటి తర్వాత కత్రినా కూడా తన ఇన్​స్టాగ్రామ్​లో యూఏఈ ట్రిప్​ ఫొటోలను పోస్ట్​ చేసింది. దీంతో వీరివురూ రహస్యంగా వెకేషన్​కు వెళ్లినట్లు గాసిప్​లు పుట్టాయి.

రాజస్థాన్​లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్​లో డిసెంబరు 7-9 తేదీల మధ్య విక్కీ-కత్రినా పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఇందులో భాగంగానే వేడుకకు విచ్చేసే ప్రముఖుల కోసం రణతంబోర్​లోని దాదాపు 45 లగ్జరీ హోటల్స్​ బుక్​ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కోహోటల్​లో దాదాపు 20 మంది వరకు ఉండొచ్చట.

ఇదీ చదవండి:విక్కీ-కత్రినా పెళ్లి.. అతిథుల కోసం 45 హోటల్స్!

విక్కీ-కత్రిన రిజిస్టర్ మ్యారేజ్.. గోప్యతకే మొగ్గు! ​

Last Updated : Dec 1, 2021, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.