బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'దబాంగ్ 3'. తాజాగా చిత్ర ప్రచారంలో భాగంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి సల్మాన్, కిచ్చా సుదీప్ వెళ్లారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఫేనరెట్ క్రికెటర్ అని తెలిపాడు సల్మాన్.
ధోనీ ఆడే విధానం నాకు ఎంతో ఇష్టం. ఇక టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. నా ఫేవరెట్ స్టార్ అయితే మాత్రం ధోనీనే. అతను దబాంగ్ ప్లేయర్.
సల్మాన్ ఖాన్, సినీ నటుడు.
మైదానంలో ఎవరు బాగా ఆడితే వారే నా ఫేవరెట్ అని కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తెలిపాడు.
"మైదానంలో ఒక ఆటగాడు రికార్డులు బద్దలుకొట్టినా, అర్ధశతకాలు, శతకాలు సాధించినా మరో ఆటగాడు ప్రోత్సహించడం మనం చూస్తుంటాం. అది ఎంతో గొప్ప విషయం. అలాంటి సానుకూల దృక్పథంతో మనం ఆటగాళ్లకు అభిమానులవుతాం. నా ఆల్‌టైమ్ ఫేవరేట్ క్రికెటర్ అనిల్ కుంబ్లే. రోహిత్‌శర్మ ఆట కూడా ఎంతో ఇష్టం"
కిచ్చా సుదీప్, సినీ నటుడు
ప్రభుదేవా దర్శకత్వం వహించిన 'దబాంగ్ 3' సినిమాలో సల్మాన్‌కు జోడిగా సోనాక్షి నటించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.