తమిళ ప్రముఖ నటుడు ధనుష్.. నేరుగా తెలుగులో నటించేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయనున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 'లవ్‌స్టోరి' చిత్రాన్ని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ.. ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా విడుదల కానుంది. ధనుష్‌కు క్రేజ్ దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.
ధనుష నటించిన 'జగమే తంత్రం'.. శుక్రవారం (జూన్ 18) ఓటీటీలో విడుదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం తెరకెక్కిన 'లవ్ స్టోరి' కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. జులై లేదంటే ఆగస్టులో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
ఇదీ చదవండి : హద్దులు చెరిపేస్తూ.. దేశమంతా విస్తరిస్తూ..