ETV Bharat / sitara

ఆ స్పెషల్​ సాంగ్​కు సమంతనే కరెక్ట్​​: దేవీశ్రీ ప్రసాద్​ - దేవీశ్రీప్రసాద్​ సమంత

ఆ స్పెషల్​ సాంగ్​కు హీరోయిన్​ సమంతనే గుడ్​​ ఛాయిస్​​ అని అన్నారు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్​. అందుకు గల కారణాన్ని కూడా వివరించారు.

samantha
సమంత
author img

By

Published : Jan 17, 2022, 8:00 PM IST

Samantha O antava song: అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప'లోని స్పెషల్​ సాంగ్‌ 'ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ' సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కెరీర్‌లోనే తొలిసారి ఈ పాటతో ప్రత్యేక గీతంలో నర్తించింది నటి సమంత. ఈ పాటకు సమంతనే గుడ్‌ ఛాయిస్‌ అని, దాని వెనుక ఉన్న కారణాన్ని చెప్పాడు చిత్ర సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. "వాస్తవానికి ఈ పాటంతా సిద్ధమైనా.. ఇందులో ఎవరు నర్తిస్తారన్నది అప్పటికింకా ఫైనల్‌ కాలేదు. సమంతను ఎంపిక చేయాలన్నది పూర్తిగా దర్శకుడు సుకుమార్‌, నిర్మాతల నిర్ణయం. ఇక సామ్‌ను ఫైనల్‌ చేసిన రెండు రోజుల ముందే నాకా విషయం తెలిసింది. ఈ పాటకు సామ్‌ను ఓకే చేయడం చక్కటి ఎంపిక‌. పాటకు ఫ్రెష్‌ ఫీల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ ఆమెను వివిధ పాత్రల్లో చూశాం. తొలిసారి స్పెషల్​ సాంగ్‌లో కనిపించడం, అలాగే ఆమె మేకోవర్‌ కూడా చాలా బాగుంది. నా మ్యూజిక్‌లో నర్తించడం సంతోషంగా ఉంది. తన డ్యాన్స్, లుక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాట కోసం తను చేసిన కృషిని అభినందిస్తున్నా" అని అన్నారు.

ఆ విషయాన్ని ఫ్యాన్స్‌ నా దృష్టికి తీసుకొచ్చారు..

ఈ మధ్యనే ఓ ఫన్‌ ఫ్యాక్ట్‌ను అభిమానులు నాతో పంచుకున్నారు. "దక్షిణాది ప్రముఖ కథానాయికులు చేసిన స్పెషల్​ సాంగ్స్‌ కాజల్‌- పక్కాలోకల్‌ (జనతా గ్యారేజీ), పూజా హెగ్డే- జిగేల్‌ రాణి (రంగస్థలం), తమన్నా- స్వింగ్‌ జరా (జై లవకుశ), ఇప్పుడు.. సమంత- ఊ అంటావా(పుష్ప)" ఇవన్నీ మీరు కంపోజ్‌ చేసినవే అంటూ ఫన్నీ మీమ్‌ షేర్‌ చేశారు. ఇది నాకు చాలా స్పెషల్‌ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: సెగలు పుట్టిస్తున్న హాలీవుడ్​ భామ పోజులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.