ఓ పక్క గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ, మరోపక్క డీగ్లామరైజ్ పాత్రల్లోనూ కనిపిస్తూ అభిమానుల్ని అలరిస్తున్న నటి దీపికా పదుకొణె. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్‌తో కలిసి 'ద ఇంటర్న్' అనే హాలీవుడ్ రీమేక్‌లో త్వరలో నటించనుంది. రెండుతరాల మధ్య జరగిన కథతో ఈ చిత్రం తీస్తున్నారు. అయితే ఈ మధ్య దీపిక.. నామమాత్రపు పాత్రలు చేస్తుందని, కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిందీ భామ.
"నటనకు ఆస్కారమున్న పాత్ర చేయడంలో తప్పులేదు. మనం చేసే పాత్రకు హైలైట్ కావాలని అనుకోకూడదు. కథ బాగుంటే అన్నీ పాత్రలు బాగుంటాయి" - దీపికా పదుకొణె, బాలీవుడ్ నటి
హాలీవుడ్‌కు చెందిన అన్నే హాత్వే, రాబర్ట్ డెనిరోలు కలిసి నటించిన 'ద ఇంటర్న్'ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో దీపికతో పాటు రిషి కపూర్ నటిస్తున్నాడు. తన గత సినిమా 'ఛపాక్'లో యాసిడ్ బాధితురాలిగా కనిపించిందీ భామ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
వికలాంగులకు సేవ
దావోస్‌లో ఇటీవలే జరిగిన ప్రపంచ ఎకానమిక్ ఫోరం సదస్సులో, మానసిక వికలాంగుల కోసం కృషిచేసినందుకుగాను దీపిక.. క్రిస్టల్ అవార్డును అందుకుంది. ప్రస్తుతం తన భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి '83' లో నటిస్తుంది. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తీస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇదీ చూడండి.. రివ్యూ: మనసును మీటే అందమైన ప్రేమకావ్యం 'జాను'