ETV Bharat / sitara

కంగన రనౌత్​ స్థానంలో దీపికా పదుకొణె! - ఇమాలి

దర్శకుడు అనురాగ్​ బసు తదుపరి చిత్రం 'ఇమాలీ'లో అందాల తార దీపిక నటించనున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు.. దీపికను సంప్రదించినట్టు తెలిపాడు. ఈ సినిమాలో కంగన నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల తప్పుకుంది.

కంగన రనౌత్​ స్థానంలో దీపికా పదుకొణె!
author img

By

Published : Jun 23, 2019, 3:54 PM IST

బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు అనురాగ్​ బసు తదుపరి చిత్రం 'ఇమాలి'. తొలుత ఈ సినిమాలో కంగన రనౌత్​ నటిస్తుందని దర్శకుడు ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల కంగన తప్పుకుంది. అనంతరం ఇమాలిలో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశం బాలీవుడ్​ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అగ్ర కథనాయిక దీపికా పదుకొణె ఈ చిత్రంలో నటించడానికి సిద్ధపడుతోందని కొన్ని రోజులుగా పుకార్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ పుకార్లపై సినిమా దర్శకుడు అనురాగ్​ బసు స్పందించాడు. ఇమాలి కోసం దీపికను సంప్రదించినట్టు తెలిపాడు.

"నేను దీపికను కలవడం వాస్తవం. కానీ తను సినిమాలో నటించడంపై ఇప్పట్లో నేనేం చెప్పలేను. ఇమాలిలో నటించడంపై దీపిక నాకు స్పష్టత ఇస్తే ఇతరులకు చెప్పగలను."
-అనురాగ్​ బసు, దర్శకుడు.

ప్రస్తుతం దీపిక 'చపాక్​' చిత్ర షూటింగ్​ పూర్తి చేసుకుంది. చపాక్​తో ఈ సొగసరి నిర్మాణ రంగంలోకి ప్రవేశపెట్టనుంది. ఇమాలి నుంచి తప్పుకున్న కంగన... 'మెంటల్​​ హై క్యా' చిత్ర షూటింగ్​లో బిజీ బిజీగా గడుపుతోంది.

ఇదీ చూడండి- WC19: కోహ్లీకి జరిమానా... నిషేధం ముప్పు!

Intro:Body:

rt

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.