Deepika ranveer movies: 'గెహ్రాహియా' ట్రైలర్, పాటలు ఈ మధ్య రిలీజయ్యాయి. ఇందులో దీపికా పదుకొణె బోల్డ్ సీన్స్ చేయడం చూసి చాలామంది ప్రేక్షకులు షాకయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఈ రేంజ్లో, ఇలాంటి సన్నివేశాల నటిస్తుందా? ఆమె భర్త, హీరో రణ్వీర్ సింగ్ అసలు ఎలా ఫీలవుతున్నాడు? ఇబ్బంది ఏం రాలేదా? అని చాలామందికి సందేహాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటికీ దీపికనే స్వయంగా సమాధానమిచ్చింది. ఈ సినిమాలోని తన సీన్స్‌పై రణ్వీర్ రియాక్షన్ గురించి కూడా దీపిక చెప్పింది.
"ట్రైలర్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సినిమా చూసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు" అని భర్త రణ్వీర్ గురించి దీపిక చెప్పింది.
రొమాన్స్, మోడ్రన్ రిలేషన్షిప్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల కానుంది. ఇందులో దీపికతో పాటు సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కీలకపాత్రలు పోషించారు. షకున్ బత్రా దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: