బాలీవుడ్ నటి దీపికా పదుకొణె 'మహాభారతం' ఆగిపోయిందా! అంటే అవుననే బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపు ఏడాదిన్నర అవుతున్న సరే దర్శకుడి ఇంకా ఫైనల్ కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
2019 అక్టోబరులో 'మహాభారతం' సినిమా నిర్మించనున్నట్లు కథానాయిక దీపిక తెలిపింది. ఈ కథ ద్రౌపది ఆలోచనలకు అనుగుణంగా సాగుతుందని వెల్లడించింది. అయితే ఈ ప్రాజెక్టుకు ఎంతోమంది దర్శకుల పేర్లు పరిశీలించినా సరే ఎవరూ సెట్ కాలేదు. అదే సమయంలో దీపిక కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీ అయిపోవడం వల్ల ఆ చిత్రాన్ని పక్కన పెట్టిసినట్లు తెలుస్తోంది. ఒకవేళ దర్శకుడు దొరికితే వెంటనే 'మహాభారతం' మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం '83', శకున్ బత్రా దర్శకత్వంలో ఓ సినిమా, ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రాల్లో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది.
ఇవీ చదవండి: దీపిక ట్విట్టర్, ఇన్స్టా పోస్ట్లు డిలీట్.. ఏమైంది?