ETV Bharat / sitara

నాన్నలు స్పోర్ట్స్​ స్టార్స్​.. పిల్లలు సినిమా స్టార్స్​.. - సచిన్ తెందూల్కర్​

Deepika Padukone: సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రుల ఎంచుకున్న రంగాన్నే ఎంచుకుంటారు. కొందరు మాత్రం వారి తల్లిదండ్రుల రంగాలకు విరుద్ధంగా కొత్త రంగంలోకి ప్రవేశిస్తారు. క్రీడా రంగంలో విశేషాదరణ పొందిన ఆటగాళ్ల పిల్లలు కొందరు మోడలింగ్​, యాక్టింగ్​ రంగంలోకి వచ్చారు. ఇలా కొత్త రంగంలోకి ప్రవేశించి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వారి గురించి చూద్దాం.

deepika padukone, saif ali khan
దీపికా పదుకొణె, సైఫ్​ అలీ ఖాన్​
author img

By

Published : Feb 25, 2022, 5:47 PM IST

మంచైనా, చెడైనా తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై కచ్చితంగా పడుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. కొందరు తాము ఉన్న రంగంలోనే పిల్లలు రావాలని అనుకుంటారు. మరికొందరు వారికి స్వేచ్ఛనిచ్చి, వారికిష్టమైన ఫీల్డ్​లో రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తారు. అయితే ప్రస్తుతం భారతీయ సినిమాల్లో రాణిస్తున్న పలువురు సినీ స్టార్ తండ్రులు.. ఆటల్లో ఆకట్టుకున్న వాళ్లు ఉన్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఇప్పుడు వారి పిల్లలు ఏం చేస్తున్నారు?

దీపికా పదుకొణె

బాలీవుడ్​లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో దీపికా పదుకొణె టాప్​లో ఉంటుంది. బెంగళూరులో మోడలింగ్​తో కెరీర్​​ ప్రారంభించిన ఆమె.. తన కృషితో ఈ స్థాయికి ఎదిగింది.

deepika padukone with her father praksh padukone
తండ్రి ప్రకాశ్​ పదుకొణెతో దీపికా

దీపిక తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్​ ప్లేయర్ ప్రకాశ్​ పదుకొణె. ఆయన ఇంగ్లాండ్​ ఓపెన్​ట్రోఫీ గెలుచుకున్న అతికొద్ది మంది ఇండియన్స్​ షట్లర్లలో ఒకరు. అయితే దీపిక.. మోడలింగ్​లోకి రాకముందు ​బ్యాడ్మింటన్​ ఆడేది. కానీ ఆ తర్వాత సినిమాల్లో సెటిల్ అయిపోయింది. ఆమె భర్త రణ్​వీర్ సింగ్ కూడా బాలీవుడ్​లో అగ్రహీరో.

సారా తెందూల్కర్‌

దిగ్గజ సచిన్ తెందూల్కర్‌​.. ఈ పేరు తెలియని వారు ఉండరు! అలాంటి సచిన్​ కుమార్తె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం రంగంలోకి వెళ్తుంది అని అభిమానులు అందరూ అనుకున్నారు. కానీ ఆమె మోడలింగ్​లోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె సోదరుడు అర్జున్ మాత్రం నాన్న బాటలోనే క్రికెట్​ను కెరీర్​గా ఎంచుకున్నాడు.

sachin tendulkar with sara
సారా తెందూల్కర్‌​తో సచిన్​

విందు దారా సింగ్​

ప్రముఖ రెజ్లర్​ దారాసింగ్. ఆయన​ కుమారుడు విందు దారాసింగ్ మాత్రం నటుడిగా స్థిరపడ్డారు. చాలా సినిమాలు, టీవీ సీరియల్స్​ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్​బాస్ మూడో సీజన్​లో విజేతగా నిలిచారు. సోనీ టీవీలో ప్రసారమైన 'లార్డ్ హనుమాన్' సీరియల్​లో ఆంజనేయుడి పాత్రలో నటించి, అభిమానుల్ని విందు మెప్పించారు.

vindu dara singh
విందు దారా సింగ్​

సైఫ్​-సోహ అలీ ఖాన్

బాలీవుడ్​లో ప్రముఖ నటుల్లో సైఫ్ అలీ ఖాన్. ఇతడి సోదరి సోహ అలీఖాన్ కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే​ వీరి తండ్రి మన్సూర్​ అలీ ఖాన్​ పటౌడీ.. ప్రముఖ క్రికెటర్, తల్లి షర్మిలా ఠాగూర్ నటి​. తండ్రి బాటలో కాకుండా తల్లిలా పిల్లలిద్దరూ యాక్టింగ్​లో రాణించారు.

saif, soha ali khan
సైఫ్​, సోహా అలీ ఖాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.