ETV Bharat / sitara

కరోనాతో గుర్తుపట్టలేనంతగా మారిపోయా: దీపిక - దీపికా పదుకొణె కరోనా

Deepika Padukone corona: కరోనా సోకినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను తెలిపారు బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె. వైరస్​ నుంచి కోలుకున్నాక తాను గుర్తుపట్టలేనంతగా మారిపోయానని, మెదడు కూడా సరిగా పనిచేయలేదని అన్నారు.

samantha
దీపికా పదుకొణె
author img

By

Published : Jan 8, 2022, 12:16 PM IST

Deepika Padukone corona: ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వైరస్​ బారిన పడుతున్నారు. వీరిలో బాలీవుడ్​ స్టార్​ దీపికా పదుకొణె కూడా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గన్న ఈ ముద్దుగుమ్మ.. కరోనాతో పోరాడిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.

"కరోనా తర్వాత నా జీవితమే మారిపోయింది. ఎందుకంటే వైరస్​ బారిన పడ్డాక నా శరీరంలో చాలా మార్పులొచ్చాయి. నేను వేసుకున్న మందులు, తీసుకున్న స్టెరాయిడ్స్​ వల్లేమో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాను. కొవిడ్​ చాలా భయంకరమైనది. అది సోకినప్పుడు పెద్దగా భయమనిపించలేదు. కానీ కోలుకున్న తర్వాత నా మెదడు అసలు పని చేయలేదు. దీంతో రెండు నెలల పాటు షూటింగ్స్​కు బ్రేక్​ ఇచ్చాను. అది నా జీవితంలో క్లిషమైన దశ" అని దీపిక పేర్కొన్నారు.

కాగా, శకున్​ బాత్రా దర్శకత్వంలో దీపిక నటించిన 'గెహ్రయాన్'​ ఫిబ్రవరి 11న అమెజాన్​ ప్రైమ్​లో విడుదల కానుంది. దీంతోపాటే 'సర్కస్'​, 'పఠాన్'​, 'ప్రాజెక్ట్​ కె'లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: చమ్కీ కాంతుల్లో ఊర్వశి.. శ్రద్ధా ఘాట్​ పోజులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.