బాలీవుడ్ నటి దీపికా పదుకొణె.. కొత్త ఏడాది సందర్భంగా అభిమానులకు షాక్ ఇచ్చింది. తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లోని పోస్టులన్నింటిని డిలీట్ చేసింది. ఆమె ఖాతాలు హ్యాక్ అయ్యాయని చాలా మంది భావించారు. అయితే ఉద్దేశపూర్వకంగానే దీపిక అన్నింటిని తొలగించిందని సమాచారం.
దీపికకు ట్విట్టర్లో 2 కోట్ల 77 లక్షలు, ఇన్స్టాలో 5 కోట్ల 25 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
భర్త రణ్వీర్ సింగ్తో కలిసి రాజస్థాన్లోని రణతంబోర్లో ప్రస్తుతం హాలీడేను ఎంజాయ్ చేస్తోంది దీపికా పదుకొణె.
భర్తతో కలిసి దీపిక నటించిన '83' విడుదలకు సిద్ధంగా ఉంది. శకున్ బత్రా దర్శకత్వంలో సిద్ధాంత్ చతుర్వేది, అనన్యపాండేలతో కలిసి ఓ చిత్రం చేస్తోంది.
ఇదీ చూడండి: కొత్త ఏడాది.. కొత్త సినిమాలు.. కొత్త పోస్టర్లు