'దర్బార్' సినిమా కాసుల వర్షం కురిపించిందని చిత్రబృందం ఓవైపు పోస్టర్లు విడుదల చేస్తే.. ఆ సినిమా దర్శకుడు మురుగదాస్‌కు మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. తనను చంపేస్తామని పంపిణీదారులు బెదిరిస్తున్నట్లు తాజాగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడీ స్టార్ డైరెక్టర్. తక్షణమే పోలీసు భద్రతకు ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరాడు మురుగదాస్.
![Darbar director AR Murugadoss seeks police protection as distributors demand compensation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5986805_1.jpg)
నష్టాల్లో నిర్మాణ సంస్థ..
కొంతమంది పంపిణీదారులు తమ ఇబ్బందులు పంచుకోవటానికి రజనీకాంత్ నివాసానికి వెళ్లగా, పోలీసులు వారిని అనుమతించలేదట. తాజాగా వారందరూ దర్శకుడు మురుగదాస్‌ను కలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కోపంతో ఉన్న మరికొందరు బెదిరింపులకూ పాల్పడుతున్నట్లు ఈ స్టార్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడట. అంతేకాకుండా తన నివాసానికి వెంటనే పోలీస్ భద్రతను ఇప్పించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో మురుగదాస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇటీవలే డిస్ట్రిబ్యూటర్లకు సాయం చేసే పరిస్థితిలో లేనట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఇదీ చూడండి.. 11 రోజుల్లో 'రజనీ' ఖాతాలో రూ.200 కోట్లు..!