ETV Bharat / sitara

'జేమ్స్ బాండ్' అభిమానులకు మరోసారి నిరాశ

జేమ్స్​ బాండ్​ సిరీస్​ నుంచి వస్తోన్న 'నో టైమ్​ టు డై' చిత్ర విడుదల వచ్చే ఏడాది ఏప్రిల్​ 2 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

No Time to Die
నో టైమ్​ టు డై
author img

By

Published : Oct 3, 2020, 4:55 PM IST

జేమ్స్ ​బాండ్​ సిరీస్​ నుంచి వస్తోన్న 25వ చిత్రం 'నో టైమ్​ టు డై' విడుదల మరోసారి వాయిదా పడింది. 2021 ఏప్రిల్​ 2 వరకు విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది. 'ఆలస్యం మా అభిమానులకు నిరాశ కలిగించిందని మేము అర్థం చేసుకున్నాం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా తప్పడం లేదు' అని మూవీ యూనిట్ పేర్కొంది.

ఈ చిత్రాన్ని తొలుత గ‌తేడాది న‌వంబ‌రులో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ముహూర్తం పెట్టినా, సాధ్యపడలేదు. అనంతరం ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోనే బాండ్ అడుగుపెడతాడన్నారు. కానీ క‌రోనా దెబ్బ‌తో థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. దీంతో పరిస్థితులు కుదుటపడ్డాక నవంబర్​లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2021కి మళ్లీ వాయిదా వేశారు. దీంతో బాండ్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

కాగా, ఈ చిత్రంలో బాండ్​ పాత్రలో మెరిసిన డేనియల్​ క్రేగ్​.. ఇక ఈ పాత్రకు గుడ్​బై చెప్పనున్నారు. గత నాలుగు చిత్రాల్లో బాండ్​గా డేనియల్​ నటించి మెప్పించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి 200 కిలోమీటర్లు నడిచొచ్చిన అభిమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.