ఒక్కరోజు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే చేసే మొదటి పని ఏంటని ఎదురైన ప్రశ్నకు నటుడు రానా బదులిచ్చారు. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో ప్రసారమయ్యే 'నంబర్.1 యారి' కార్యక్రమంలో రానాకు ఈ ప్రశ్న ఎదురైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు మంచు లక్ష్మి, రకుల్‌ప్రీత్‌సింగ్ హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ మాట్లాడుతూ.. "మీకు ఒక్కరోజు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే చేసే మొదటి పని ఏంటి?" అని రానాను ప్రశ్నించింది. రానా స్పందిస్తూ.. "విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటాన"ని అన్నారు. విద్య, వైద్యం ప్రజలకు సక్రమంగా అందిస్తే దేశం అంతా మారిపోతుందని తాను భావిస్తున్నానని రానా తెలిపారు. ఆదివారం రాత్రి ప్రసారమైన ఈ ఎపిసోడ్ నవ్వుల పువ్వులు పంచింది.
అయితే.. విభిన్నమైన కథలతో అలరిస్తూ వస్తున్న రానా పలు సినిమాల్లో రాజకీయ నాయకుడిగానూ కనిపించి మెప్పించారు. 'లీడర్', 'నేను రాజు నేనే మంత్రి', 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' వంటి చిత్రాల్లో రానా పొలిటికల్ లీడర్‌గా కనిపించారు. ప్రస్తుతం.. రానా నటిస్తోన్న 'విరాటపర్వం' చిత్రీకరణ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్‌తో కలిసి 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్‌లో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'వకీల్‌సాబ్' చిత్రంపై ఫిర్యాదు!