ETV Bharat / sitara

కార్తికేయ మాస్​ లుక్​.. రవితేజ ఫైర్​ లుక్​ - చావు కబురు చల్లగా

మాస్​ మహారాజ్​ రవితేజ ఫైర్​ లుక్​తో.. మరోవైపు యువ కథానాయకుడు కార్తికేయ మాస్​ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరు నటిస్తున్న కొత్త చిత్రాల పోస్టర్లను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. 'క్రాక్'​ సినిమాతో రవితేజ, 'చావు కబురు చల్లగా' చిత్రంతో కార్తికేయ వేసవిలో సందడి చేయనున్నారు.

crack-karthikeya-raviteja-chaukabuo
కార్తికేయ మాస్​ లుక్​.. రవితేజ ఫైర్​ లుక్​
author img

By

Published : Feb 13, 2020, 2:22 PM IST

Updated : Mar 1, 2020, 5:20 AM IST

'చావు కబురు చల్లగా' వినిపించేందుకు సిద్ధమయ్యాడు యువ కథానాయకుడు కార్తికేయ. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నాడు. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. తాజాగా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమాలో బస్తీ బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు కార్తికేయ. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న ఓ వాహనంపై నిల్చుని సిగరెట్‌ తాగుతూ దర్శనమిచ్చాడీ యువహీరో. గళ్ల చొక్కా, లుంగీ ధరించి బస్తీ కుర్రాడి లుక్‌లో ఒదిగిపోయాడు.

crack-karthikeya-raviteja-chaukabuo
చావు కబురు చల్లగా చిత్రం ఫస్ట్​లుక్​

రవితేజ వచ్చేస్తున్నాడు..

మరోవైపు మాస్‌ మహారాజ్‌ రవితేజ 'క్రాక్‌' సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుందీ చిత్రం. ఇందులో రవితేజ పోలీసు అధికారి పాత్ర పోషిస్తున్నాడు. బి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్‌ కథానాయిక. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్‌ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రవితేజ తుపాకి పట్టుకుని పరుగెత్తుతూ కనిపిస్తున్నాడు. అతడి ముఖం కనిపించకపోయినా ఆ కటౌట్‌కే అభిమానులు ఫిదా అవుతున్నారు. పవర్‌ఫుల్‌ లుక్‌లో వావ్​ అనిపించాడు. మే 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్‌ త్వరలోనే విడుదల చేయనుంది చిత్రబృందం.

crack-karthikeya-raviteja-chaukabuo
క్రాక్​ సినిమాలో రవితేజ

ఇదీ చూడండి.. ప్రేమికుల రోజున 'ఏయ్​ పిల్లా..' పాట విడుదల

Last Updated : Mar 1, 2020, 5:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.