ETV Bharat / sitara

sonusood: ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్​ అందించడమే లక్ష్యంగా - సోనూసూద్​ లేటెస్ట్​ న్యూస్​

వ్యాక్సినేషన్​పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సహా ప్రజలకు టీకాలు మరింత చేరువయ్యేలా కృషి చేయనున్నారు బాలీవుడ్​ ప్రముఖ నటుడు సోనూసూద్(sonusood)​. టీకాలు రిజిస్ట్రేషన్​ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేసేందుకు ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

sonusudh
సోనూసూద్​
author img

By

Published : Jun 26, 2021, 10:58 AM IST

Updated : Jun 26, 2021, 11:22 AM IST

బాలీవుడ్​ నటుడు సోనూసూద్(sonusood)​ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కరోనా ఫస్ట్​వేవ్​ ప్రారంభమైనప్పటి నుంచి బాధితులకు అండగా నిలిచిన ఆయన ఈ సారి వ్యాక్సినేషన్​పై దృష్టి సారించారు. వ్యాక్సిన్​ ప్రక్రియలో గ్రామీణ భారతానికి అండగా నిలిచేందుకు 'Coverg' పేరుతో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీకాల కోసం రిజిస్టర్​ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడానికి వాలంటీర్లు స్వయంగా ముందుకొచ్చేలా దీన్ని రూపొందించారు.

"గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ల సమస్యలను పరిష్కరించడానికి ఈ కోవర్గ్​(Coverg) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కేంద్ర ఆరోగ్య శాఖ దీన్ని ఆమోదించింది. ఇదొక అప్లికేషన్​ సర్వీస్​ ప్రొవైడర్​. ఓ స్మార్ట్​ ఫోన్​, 4జీ నెట్​వర్క్​ ఉన్న ఎవరైనా https://www.covreg.in/లో రిజిస్టర్​ చేసుకుని వాలంటీర్​గా మారొచ్చు. టీకాల రిజిస్ట్రేషన్​లో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వాలంటీర్లు సాయం చేస్తారు. ఈ మహమ్మారిని అధిగమించాలంటే వ్యాక్సినేషన్​, మన ముందున్న మార్గం."

-సోనూ సూద్​, ప్రముఖ నటుడు.

వాలంటీర్లు ఏం చేస్తారంటే?

వాలంటీర్లు స్వయంగా ముందుకొచ్చి ఈ www.covreg.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అనంతరం వ్యాక్సిన్​పై ప్రజల్లో అవగాహన కల్పించడం, టీకాలకు సంబంధించిన అపోహలకు సమాధానామివ్వడం. వ్యాక్సినేషన్​ రిజిస్ట్రేషన్​, స్లాట్లు బుక్​ చేయడం, పేర్లను నమోదు చేసుకున్న వారిని వ్యాక్సినేషన్​ సెంటర్లకు తరలించడం సహా తదితర పనులు చేస్తారు.

ఇదీ చూడండి: నటుడు సోనూసూద్​ కన్నీటి పర్యంతం

Last Updated : Jun 26, 2021, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.