కాలేజ్ నేపథ్యంలో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఇప్పుడు రాబోతున్నది మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే ఇందులో కొడుకు బదులు తండ్రి కళాశాలకు వెళ్తాడు. ఫలితంగా ఆయన బాధ్యతల్ని కొడుకు చేస్తాడు. ఇలాంటి భిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమానే 'కాలేజ్ కుమార్'. తండ్రిగా రాజేంద్ర ప్రసాద్, కొడుకుగా రాహుల్ విజయ్ నటిస్తున్నారు. ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఆద్యంతం అలరిస్తూ అంచనాల్ని పెంచుతోంది.
ఇందులో ప్రియ వడ్లమాని హీరోయిన్. మధుబాల.. హీరోకు తల్లి పాత్ర పోషిస్తోంది. హరి సంతోష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కుతుబ్ ఈ క్రిపా సంగీతమందించాడు. సురేశ్ ప్రొడక్షన్ విడుదల చేస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 6న థియేటర్లలోకి రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">