ETV Bharat / sitara

సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తా: మేఘన రాజ్ - మేఘన రాజ్​ వ్యాఖ్యలు

కన్నడ నటి, చిరు సర్జా భార్య మేఘన రాజ్ త్వరలోనే సినిమాల్లో నటిస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. చిరు మరణం తర్వాత మనోధైర్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది.

Chiru sarja wife meghana raj aiming to give re entry into movies
సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తా: మేఘన రాజ్
author img

By

Published : Dec 15, 2020, 7:20 PM IST

కన్నడ నటి మేఘన రాజ్‌ త్వరలోనే సినిమాల్లో నటించనుందని తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. జూన్ 7న ఆమె భర్త చిరంజీవి సర్జా గుండె నొప్పితో మరణించారు. అప్పటి నుంచి ఆమె ఎంతో మనోధైర్యంతో ముందుకు సాగుతోంది.

"నటనంటే నాకెంతో ఇష్టం. అది నా రక్తంలోనే ఉంది. నా భర్త చిరంజీవి సర్జా, నాకు ఇష్టమైనదేదీ వదులుకోవద్దని, నటించమని చెప్పేవారు. అందుకే నేను ఉన్నంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటా. తప్పకుండా త్వరలోనే సినిమాల్లో తిరిగి నటిస్తా".

-మేఘన రాజ్, కన్నడ నటి.

మేఘన తల్లిదండ్రులు సుందర్‌ రాజ్‌, ప్రమీల జోషాయ్‌ కన్నడ నటీనటులు. బాల నటిగా తన తండ్రితో కలిసి 'జోకుమారస్వామి' చిత్రంలో ఆమె నటించింది. అదే విధంగా తాజాగా తన కుమారుడికి సంబంధించిన ప్రతి అంశాన్ని, ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఇదీ చదవండి:అబ్బో.. ఆ సినిమాలో ఎన్నెన్ని ముద్దులో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.