ETV Bharat / sitara

చిరు-కొరటాల చిత్రం నుంచి మెగాస్టార్ లుక్ లీక్

మెగాస్టార్ చిరంజీవి, త్రిష ప్రధానపాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా నుంచి మెగాస్టార్ లుక్ ఒకటి లీకైంది.

Chiru
చిరంజీవి
author img

By

Published : Feb 23, 2020, 2:29 PM IST

Updated : Mar 2, 2020, 7:18 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'చిరు 152'వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం చిరంజీవిపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన చిరంజీవి లుక్‌ ఒకటి నెట్టింట్లో లీకైంది.

ఈ ఫొటోలో చిరు మెడలో ఎర్ర కండువా ధరించి మాస్​ లుక్​లో దర్శనమిచ్చాడు. ఈ లుక్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి లుక్ చూసిన అభిమానులు.. వివిధ సందర్భాల్లో మెగా హీరోలు ఎర్ర కండువాతో ఉన్న లుక్స్‌ను యాడ్‌ చేసి నెట్టింట్లో పలు ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు.

'చిరు152'లో త్రిష హీరోయిన్​. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందీ చిత్రం.

Last Updated : Mar 2, 2020, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.