ఒలంపిక్స్ లాంటి క్రీడల్లో ప్రపంచ దేశాలతో పోటీపడుతూ పతకాలు సాధిస్తున్న ఆడబిడ్డల మూలంగా దేశం తలెత్తుకొని నిలబడుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. క్రీడరంగంలో ఆడపిల్లలు అద్భుతంగా రాణిస్తుండటం ప్రజలందరికి గర్వకారణమని కొనియాడారు. కబడ్డీ నేపథ్యంగా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది రూపొందించిన 'సీటీమార్'(Gopichand Seetimaarr) ప్రచార చిత్రాన్ని వీక్షించిన చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.
గ్రామీణ క్రీడను తెరపై ఆవిష్కరించిన సంపత్ నందిని ప్రత్యేకంగా అభినందించారు. మారుమూల ప్రాంతాల్లోని అమ్మాయిలు కబడ్డీ ఆటకు ఎలాంటి వన్నె తీసుకొచ్చారనే కథాంశం చాలా బాగుందని, సంపత్ నది కథ చెప్పడంలో మంచి ప్రావీణ్యుడని కొనియాడారు. ఈ నెల 10న విడుదలవుతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కబ్డడీ నేపథ్యంలో సాగే ఈ కథలో గోపిచంద్,తమన్నా(Gopichand tamannah movie) కబడ్డీ కోచ్ల పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించగా, శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Seetimaarr: గోపిచంద్ 'సీటీమార్' ట్రైలర్ అదుర్స్