ETV Bharat / sitara

సుధాకర్ దంపతుల డ్యాన్స్.. మెగాస్టార్ ఫుల్ ఫిదా! - chiranjeevi birthday

తన పుట్టినరోజు కానుకగా నటుడు సుధాకర్ చేసిన డ్యాన్స్ వీడియోను చూసి మెగాస్టార్ చిరంజీవి ఆనందించారు. 'ఛాలెంజ్' సినిమా జ్ఞాపకాల్ని మళ్లీ గుర్తు చేశారని చెబుతూ ఆడియో మెసేజ్​ను వారికి పంపించారు.

సుధాకర్ దంపతుల డ్యాన్స్.. మెగాస్టార్ ఫుల్ ఫిదా!
మెగాస్టార్ చిరంజీవి
author img

By

Published : Aug 28, 2020, 3:48 PM IST

'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌', 'నువ్వు తోపురా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు సుధాకర్‌ కొమ్మాకుల. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు సుధాకర్. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అతడు, తన భార్యతో కలిసి చిరు పాటకు డ్యాన్స్‌ చేసి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

'ఛాలెంజ్‌'లోని 'ఇందువదన.. కుందరదన' అంటూ సాగే పాటకు చిరు-విజయశాంతి అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడే అదే పాటను సుధాకర్‌ తన భార్య హారికతో కలిసి డ్యాన్‌ చేశారు. ఈ వీడియోను చూసిన చిరంజీవి సుధాకర్‌ను అభినందిస్తూ ఆడియో సందేశాన్ని పంపారు.

"హాయ్‌ సుధాకర్‌.. హారిక ఎలా ఉన్నారు. నా పుట్టినరోజున మీరు ఇచ్చిన విజువల్‌ ట్రీట్‌కు ధన్యవాదాలు. బ్యూటిఫుల్‌ గిఫ్ట్‌. ఆ పాట చూస్తున్నంతసేపూ నా గత స్మృతులు 'ఛాలెంజ్‌' డేస్‌ గుర్తుకు రావడం ఒక ఎత్తయితే, మీరు ఆ పాటకు డ్యాన్స్‌ను రీప్రొడ్యూస్‌ చేయాలన్న ఆలోచన దగ్గర నుంచి ప్రాక్టీసు చేయడం, షూట్‌ చేయడం, నాకు పంపించాలన్న ప్రయత్నం ఇవన్నీ మీరు ఊహించని దానికన్నా నన్ను ఎక్కువగా సంతోషింపజేశాయి. మీరు ఇండియాలో ఉంటే నా సంతోషాన్ని ఇంకోలా తెలిపేవాడినేమో. ఎక్కడో అమెరికాలో దూరంగా ఉన్నారు కాబట్టి, ఎలా తెలపాలో తెలియక మీ దంపతులకు నా వాయిస్‌ మెస్సేజ్‌ పంపుతున్నా.. సుధాకర్‌ నువ్వు సినిమా హీరోవి డ్యాన్స్‌ చేస్తావు. కాబట్టి అది ఊహించగలం. హారిక ఓ టెకీ. తను సినిమాకు సంబంధం లేని అమ్మాయి అయినా, అంత చక్కగా డ్యాన్స్‌ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తన గ్రేస్‌, స్టైల్‌కు కొంచెం ఎక్కువ మార్కులు వేస్తున్నా ఏమీ అనుకోకు. బహుశా నీ ట్రైనింగ్‌ అయి ఉంటుంది. మీ దంపతులు ఎలాగైతే చక్కగా డ్యాన్స్‌ చేసి రక్తి కట్టించారో, అలాంటి సమన్వయంతో జీవితంలో కూడా 'లైఫ్ ఈజ్‌ బ్యూటి ఫుల్‌' అనేలా కొనసాగించాలని నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అంటూ చిరు ఆడియో సందేశాన్ని పంచుకున్నారు.

తమ పాటకు చిరు స్పందనతో సుధాకర్‌ దంపతులు ఆనందపడిపోయారు. థ్యాంక్యూ మెగాస్టార్‌ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.