'సైరా నరసింహా రెడ్డి'తో ప్రేక్షకులను అలరించాడు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రబృందం.. షూటింగ్ ప్రారంభానికి తేదీ నిర్ణయించిదని ఫిలింనగర్ వర్గాల్లో టాక్.
'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను'.. ఇలా వరుస హిట్లు అందుకున్న కొరటాల శివ.. చిరు సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం వల్ల.. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే కథను సిద్ధం చేశాడట ఈ డైరక్టర్. రెగ్యులర్ షూటింగ్.. క్రిస్మస్ తర్వాత రోజు నుంచి మొదలు కానుందట.
ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్గా నటించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు అందిస్తున్నాడు. రామ్‌చరణ్ నిర్మాత. వచ్చే ఏడాది ద్వితియార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
ఇది చదవండి: జార్జ్‌రెడ్డి గురించి అప్పుడే విన్నా: మెగాస్టార్ చిరంజీవి