ETV Bharat / sitara

Acharya Update: తుది షెడ్యూల్​లో పాల్గొన్న 'ఆచార్య' - ఆచార్య చిరంజీవి

మెగాస్టార్​ చిరంజీవి 'ఆచార్య' చిత్రీకరణ(Acharya Shooting)లోని ఆఖరి షెడ్యూల్​ బుధవారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్​లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవి(Chiranjeevi) సహా ఇతర నటీనటులపై సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. 15 రోజుల్లో షూటింగ్​ను పూర్తి చేయనున్నట్లు టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

Chiranjeevi begins shoot for Koratala Siva's Acharya post lockdown
Acharya Update: తుది షెడ్యూల్​లో పాల్గొన్న 'ఆచార్య'
author img

By

Published : Jul 8, 2021, 6:54 AM IST

తారలు కెమెరా ముందుకొచ్చే వేళ ఇది. రెండో దశ కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల.. ఇదివరకు ఆగిపోయిన సినిమాలన్నీ మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. అగ్ర హీరో చిరంజీవి తాను నటిస్తున్న 'ఆచార్య'(Acharya) కోసం బుధవారం సెట్లోకి అడుగు పెట్టారు. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్లో సన్నివేశాల్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ గతంలోనే తుదిదశకు చేరుకున్నా.. కరోనా కారణంగా ఆగిపోయింది.

ప్రస్తుతం ఏకధాటిగా సాగే ఈ షెడ్యూల్​లో సినిమాను పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం రంగంలోకి దిగింది. రెండు రోజుల ప్యాచ్‌ వర్క్‌ కోసం రామ్​ చరణ్‌(Ram Charan) తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాలోని రెండో లిరికల్‌ గీతానికి సంబంధించి ఓ ప్రకటన వెలువడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చరణ్‌, పూజాలపై చిత్రీకరించిన పాటను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ నాయిక. రామ్‌చరణ్‌, పూజా హెగ్డే(Pooja Hegde) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇదీ చూడండి.. Acharya Update: ఆఖరి షెడ్యూల్​కు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.