ETV Bharat / sitara

జనతా కర్ఫ్యూకు కమల్​, చిరు మద్దతు - జనతా కర్ఫ్యూకు కమల్​,చిరు మద్దతు

ప్రధానమంత్రి మోదీ పిలుపునకు మద్దతు ప్రకటించారు కథానాయకులు చిరంజీవి, కమల్​హాసన్​. పెనువిపత్తు నుంచి కాపాడుకోవడానికి ప్రజలందరూ సమైక్యతతో ఇంట్లో సురక్షితంగా ఉండాలని సూచించారు.

Chiranjeevi and Kamalhassan supports Janata curfew
జనతా కర్ఫ్యూకు కమల్​,చిరు మద్దతు
author img

By

Published : Mar 21, 2020, 10:45 AM IST

ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు నటుడు, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌, మెగాస్టార్​ చిరంజీవి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కమల్​ ట్వీట్‌ చేయగా.. చిరు ఓ వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

" ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అసాధారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పెనువిపత్తు నుంచి కాపాడుకోవడానికి సమైక్యతతో ఇంట్లో సురక్షితంగా ఉందాం. దీనికి మద్దతు ఇవ్వాలంటూ నా అభిమానులు, మిత్రులను కోరుతున్నాను."

-కమల్​హాసన్​, కథానాయకుడు.

ఈ ట్వీట్‌ను విజయ్‌, అజిత్‌, రజనీకాంత్‌, సూర్య, ధనుష్‌, విజయ్‌ సేతుపతి, శింబు తదితర తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖుల ట్విట్టర్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేశాడు కమల్.

  • I stand in full solidarity with our Prime Minister’s call for #JantaCurfew.

    In this extraordinary situation, we have to take extraordinary measures.

    It’s a disaster that has befallen on us and by staying united and indoors, we can Stay Safe. (1/2)

    — Kamal Haasan (@ikamalhaasan) March 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనాను నియంత్రించడానికి క్షేత్రస్థాయిలో అహర్నిశలు స్నేహాభావంతో 24గంటలు పనిచేస్తోన్న వైద్యబృందానికి, స్వచ్ఛ కార్యక్రమానికి, పోలీసు శాఖవారికి, ఆయా ప్రభుత్వాలకు హర్షాతిరేకలు ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయం ఇదని తెలిపాడు చిరంజీవి.

"భారతీయులుగా మనమందరం ఒకటిగా నిలబడి ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొందాం. సామాజిక సంఘీభావం తెలుపుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం."

-చిరంజీవి, కథానాయకుడు.

ఈనెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మంత్రి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి : మరోసారి వెండితెరపై 'ఖైదీ 150' కాంబో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.