ETV Bharat / sitara

Narappa: 'చలాకీ చిన్నమ్మి' వచ్చేసింది! - చలాకి చిన్నమ్మి లిరికల్​ సాంగ్

కథానాయకుడు వెంకటేశ్​ (Venkatesh)- దర్శకుడు శ్రీకాంత్​ అడ్డాల(Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నారప్ప'(Narappa). ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇటీవలే సెన్సార్​ను కూడా పూర్తి చేసుకుంది. దీంతో సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా చిత్రంలోని 'చలాకీ చిన్నమ్మి'(Chalaki Chinnammi Song) అంటూ సాగే తొలి లిరికల్​ సాంగ్​ను విడుదల చేసింది.

Chalaaki Chinnammi: First lyrical video from Venkatesh's Narappa Movie
Narappa: 'చలాకి చిన్నమ్మి' వచ్చేసింది!
author img

By

Published : Jul 11, 2021, 1:11 PM IST

విక్టరీ వెంకటేశ్​ 'నారప్ప'(Narappa) నుంచి తొలి లిరికల్​ సాంగ్​ వచ్చేసింది. 'చలాకీ చిన్మమ్మి' అంటూ సాగే తొలి లిరికల్​ సాంగ్​ను(Chalaki Chinnammi Song) ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ గీతాన్ని ఆదిత్య అయ్యంగార్​, నూతన్​ మోహన్​ ఆలపించారు. కుటుంబ నేపథ్యంలో సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సెన్సార్​ పూర్తి

'నారప్ప' సినిమా కోసం సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్​ పూర్తి చేసుకున్న 'నారప్ప' చిత్రం.. ఇటీవలే సెన్సార్​ పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్​ బృందం.. 'నారప్ప'కు యూ/ఏ(U/A) సర్టిఫికేట్​ ఇవ్వడం సహా చిత్రబృందాన్ని ప్రశంసించినట్లు సమాచారం.

ఓటీటీలో 'నారప్ప'

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌కు 'నారప్ప' టీమ్‌తో డీల్‌ కుదిరిందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జులై 24న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా 'నారప్ప'(Narappa on Amazon Prime) ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తమిళ స్టార్​ హీరో ధనుష్‌ కథానాయకుడిగా కోలీవుడ్‌లో తెరకెక్కిన సూపర్‌హిట్‌ చిత్రం 'అసురన్‌'. ఈ సినిమాకు తెలుగు రీమేక్‌గా 'నారప్ప' సిద్ధమైంది. శ్రీకాంత్‌ అడ్డాల(Srikanth Addala) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేశ్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా ప్రియమణి నటించారు. కుల వ్యవస్థ, భూ వివాదం.. వంటి సామాజిక అంశాలతో ఈ సినిమా చిత్రీకరించారు.

ఇదీ చూడండి.. RRR: ప్రమోషన్స్​ షురూ.. మేకింగ్​ వీడియో ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.