మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తూ సందడి చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇంటివద్ద కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరు తన తదుపరి సినిమాల గురించి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నానని, అది అయ్యాక సుజిత్‌తో 'లూసిఫర్' చేసే ఆలోచనలో ఉన్నానని చిరంజీవి తెలిపారు. అంతేకాకుండా యువ దర్శకుడు బాబీ, మెహర్ రమేశ్ తనకి కథలు చెప్పారని, అలాగే సుకుమార్, హరీశ్ శంకర్, పరశురాం కూడా తనతో పనిచేయాలనే ఆలోచనతో ఉన్నారని మెగాస్టార్ వెల్లడించారు.
ఇప్పటికే కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్న చిరంజీవి తదుపరి లైనప్ బలంగానే ఉందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'ఆచార్య' షూటింగ్ పూర్తయ్యాక ముందుగా 'లూసిఫర్' రీమేక్ వైపే చిరు మొగ్గుచూపే అవకాశం ఉంది.